స్టార్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రేమ కథ( Premakatha ) అనే సినిమాతో తెలుగు చిత్ర సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు అక్కినేని సుమంత్.అక్కినేని నాగేశ్వరరావు కూతురి కొడుకు సుమంత్.

నాగేశ్వరరావు ( Nageshwara rao ) చిన్నప్పుడే సుమంత్ ని దత్తత తీసుకొని తన కూతురు విదేశాలకు వెళ్తే తన దగ్గర పెంచుకున్నాడు.ఇక తమ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి ప్రేమ కథ అనే సినిమాతో తీసుకువచ్చారు.ఈ సినిమా తర్వాత యువకుడు మంచి హిట్ అయినప్పటికీ ఆ తర్వాత కొన్ని వరుస ప్లాఫ్ లు వెంటాడాయి.ఇక ఈయన సినీ కెరియర్లో మధుమాసం,పౌరుడు, గౌరీ, గోదావరి, సత్యం, సుబ్రహ్మణ్యపురం,గోల్కొండ హై స్కూల్ వంటి సినిమాలు హిట్ ఇచ్చాయి.హీరోగా అవకాశాలు తగ్గినప్పటికీ ఈ మధ్యకాలంలో కీలక పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.అయితే అలాంటి అక్కినేని సుమంత్ ( Akkineni Sumanth ) తన సినీ కెరీర్ ని సరిగ్గా బిల్డ్ చేసుకోకపోవడంతో వరుస ప్లాఫ్ లు వెంటాడాయి.కేవలం సినీ కెరియర్ మాత్రమే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఈయన ఫెయిల్ అయ్యారు అని చెప్పవచ్చు.2004లో తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ వీరి ప్రేమ కనీసం రెండు సంవత్సరాలు కూడా నిలవలేకపోయింది.

దాంతో వీళ్ళిద్దరూ 2006లో విడాకులతో దూరమయ్యారు.అయితే కీర్తి రెడ్డి విడాకులు( Divorce ) తీసుకున్నాక బెంగళూరుకు చెందిన మరో అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది.కానీ అక్కినేని సుమంత్ మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే ఉంటూ వస్తున్నారు.అయితే మాజీ భార్య కీర్తి రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా సుమంత్ ఇప్పటికీ ఆమెతో ఆ పని చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ గా మారింది.
ఇక అసలు విషయం ఏమిటంటే.రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్కినేని సుమంత్ తనకి సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.
అదేంటంటే.నేను కీర్తి రెడ్డి విడిపోయినప్పటికి కూడా ఇప్పటికి చాలా స్నేహంగానే ఉంటాం.
అంతే కాదు వారంలో నాలుగైదు సార్లు అయినా సరే కీర్తి నేను ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటాం.అలాగే ప్రతిరోజు చాటింగ్ చేస్తుంది.
ఇక కీర్తి రెడ్డికి మంచి కుటుంబం మంచి భర్త దొరికాడు.ప్రస్తుతం కీర్తి రెడ్డి బెంగళూరు( Bangalore )లోనే స్థిరపడింది అంటూ తనకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు.

దీంతో అక్కినేని సుమంత్ (Akkineni Sumanth) మాట్లాడిన వీడియో నెట్టింట్లో చక్కెర్లు కొట్టడంతో విడాకులయ్యాక మాజీ భార్య తో మాట్లాడం ఏంటి అంటూ కొంతమంది కామెంట్లు పెడితే సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ లే అని మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ విడాకులు తీసుకోక ముందే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ కి వచ్చి మీ మధ్య ఉండే గొడవలను పక్కకు పెట్టి అన్యోన్యంగా ఉంటే మీ జంట ఎంతో చూడముచ్చటగా ఉండేది కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.







