ఒక సినిమా చేయాలంటే ఒక డైరెక్టర్( Director ) ఎన్ని రకాలు గా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుందో ఎవ్వరికి తెలియదు.ఎందుకంటే ఆయన కష్టం ఎవ్వరికి కనిపించదు కానీ ఒక సినిమా ప్లాప్ అయిన వెంటనే అందరు ఆయనదే తప్పు అన్నట్టు గా అందరు ఆయన మీద పడి ఏడుస్తారు.
అందుకే ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు గాని, ప్రొడ్యూసర్లు గాని డైరెక్టర్ అంటే ఒక రెస్పెక్ట్ తో ఉండాలి అని చాలా మంది సినిమా పెద్దలు కూడా చెప్తూ ఉంటారు.ఎందుకంటే ఆయనే కెప్టెన్ అఫ్ ది షిప్ కాబట్టి ఆయన చెప్పిన మాటలు వింటూ సినిమా చేసుకుంటూ ముందుకు వెళ్తే సినిమా పక్క గా హిట్ అవుతుందనే చెప్పాలి.
కానీ అలా కాకుండా ఒక డైరెక్టర్ చేసే ప్రతి పనిలో హీరో గాని, ప్రొడ్యూసర్ గాని వేళ్ళు పెట్టి ఇలా కాదు అలా చేయి అని సలహాలు ఇస్తూ ఉంటె డైరెక్టర్ కథ కంప్లిట్ గా మారిపోతుంది.

దీనివల్ల ఆయన అనుకున్న కథని అనుకున్నట్టుగా చేయలేడు అందుకే చాలా సినిమాలు ప్లాప్ అవుతూ ఉంటాయి.ఒక వేళా సినిమా హిట్ అయితే హీరో అయిన ప్రొడ్యూసర్( Producer ) అయిన నేను చెప్పినట్లు గా చేశావ్ కాబట్టే సినిమా ఆడింది లేకపోతే ప్లాప్ అయ్యేది అని వాళ్ళకి క్రెడిట్ వచ్చేలా మాట్లాడుకుంటారు, అలా కాకుండా సినిమా ప్లాప్ అయితే మాత్రం అంత డైరెక్టర్ తప్పే అన్నట్టు గా క్రియేట్ చేస్తారు.ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లు ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి మాటలు ఎదురుకున్న వారే…

అయితే ఇలాంటి ప్రాబ్లమ్ తోనే సినిమా మధ్యలోనే కొంతమంది డైరెక్టర్లు సినిమా నుంచి బయటికి వచ్చేస్తుంటారు.అలా బయటికి వచ్చిన వాళ్లలో డైరెక్టర్ తేజ ( Director teja )ఒకరు ఎన్టీయార్ బయోపిక్ కి మొదట ఈయనే డైరెక్టర్ అయిన కూడా ఆయన రాసిన కథ ఒక వర్షన్ సినిమా యూనిట్ కి వినిపిస్తే అదీ నచ్చక ఇలా చేంజెస్ చేయి అని బాలయ్య( Nandamuri Balakrishna ) తోపాటు చిత్ర యూనిట్ కూడా తేజ కి సలహాలు ఇవ్వడం తో ఇలా అయితేనే చేస్తా లేకపోతే చేయను అని చెప్పి తేజ బయటికి వచ్చాడు.ఇక ఆ తర్వాత రెండు పార్టులు గా వాళ్లు చేసిన ఆ సినిమాలు ప్లాప్ అయ్యాయి అదే ఒక వేళా తేజ తీసి ఉంటె అదీ తేజ తీయడం వల్లే ప్లాప్ అయింది అని చెప్తూ ఉంటారు…
.








