సీడబ్ల్యూసీ సమావేశాల అనంతరం ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.కాగా ఈనెల 16 మరియు 17వ తేదీలలో హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఆయన కోరారు.
కాగా ఈ సమావేశాలకు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలు జాతీయ స్థాయి నేతలు హాజరుకానున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే తెలంగాణకు సోనియాగాంధీ ఐదు పథకాలను ప్రకటిస్తారని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు.తెలంగాణ రాష్ట్రం రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్న ఆయన రాష్ట్ర ప్రజలు ఎవరూ కేసీఆర్ ను నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోనూ హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.







