తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఛాలెంజ్ చేశారు.ఈ మేరకు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ పై ఆయన సవాల్ విసిరారు.
రైతులకు 24 గంటలు విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించారు.ఈ విషయంపై శాసనసభలో చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు.
ఈ క్రమంలోనే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ పై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.ఇందులో భాగంగానే 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో చూపించాలని వెల్లడించారు.