హరిహర వీరమల్లు షూట్ ఆలస్యం వల్ల ఆ సినిమా నిర్మాతకు అన్ని రూ.కోట్ల నష్టమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) క్రిష్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా హరిహర వీరమల్లు( Harihara Veeramallu ) టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సుదీర్ఘకాలం పాటు షూటింగ్ ను జరుపుకుంటోంది.పవన్ కళ్యాణ్ ఇతర సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్న స్థాయిలో హరిహర వీరమల్లు సినిమాకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని సమాచారం అందుతోంది.

 Huge Pressure On Harihara Veeramallu Movie Producer Details, Harihara Veeramallu-TeluguStop.com

ఈ సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటంతో ఎక్కువ డేట్స్ అవసరం అవుతుండటం గమనార్హం.

అయితే హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల నిర్మాత ఏఎం రత్నంపై( Producer AM Rathnam ) అదనపు భారం అంతకంతకూ పెరుగుతోంది.

ఈ సినిమా మొదలై దాదాపుగా మూడేళ్లు అవుతోంది.ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నా ఈ సినిమా షూటింగ్ 50 శాతానికి పైగా పెండింగ్ లో ఉందని సమాచారం అందుతోంది.

హరిహర వీరమల్లు సినిమా వల్ల క్రిష్( Director Krish ) కెరీర్ కూడా ఇబ్బందుల్లో పడింది.

Telugu Krish, Pawan Kalyan, Rathnam, Tollywood-Movie

హరిహర వీరమల్లు షూట్ ఆలస్యం వల్ల ఈ నిర్మాతకు వడ్డీల రూపంలో భారీ స్థాయిలో నష్టాలు మిగిలాయని తెలుస్తోంది.పవన్ ఈ సినిమా తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు సైతం వేగంగా పూర్తవుతుండటం గమనార్హం.మొఘలుల కాలం( Mughals ) బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Telugu Krish, Pawan Kalyan, Rathnam, Tollywood-Movie

హరిహర వీరమల్లు మూవీ టెక్నీషియన్ల విషయంలో కూడా కీలక మార్పులు జరిగాయని సమాచారం అందుతోంది.మూవీ ఆలస్యం వల్ల నిర్మాతపై 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడుతోందని తెలుస్తోంది.పవన్ ఈ సినిమాను వేగంగా పూర్తి చేస్తే నిర్మాతలకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.ఈ సినిమా వల్ల భారం పెరుగుతున్నా నిర్మాత ఏఎం రత్నం మాత్రం సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube