ఇటీవల కాలంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్( Rajanikanth ) యాక్టివ్ అయ్యారు.వివిధ రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తున్నారు.
అనేక సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు.అనేక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొంటూ కొన్ని రాజకీయ పార్టీలపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు.
ఇటీవల రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన మరింత ఉత్సాహంగా ఉన్నారు.దేశ విదేశాల్లోనూ రజనీకి భారీగా అభిమానులు ఉండడంతో , ఆయన ఇమేజ్ ను వాడుకునేందుకు కేంద్ర అధికార పార్టీ బిజెపి సిద్దమైంది అనే వార్తలు వస్తున్నాయి.
ఈ మేరకు ఆయనకు గవర్నర్ పదవి ఆఫర్ చేసినట్లుగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.రజనీకాంత్ ఇటీవల కాలంలో చేపట్టిన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) తో పాటు, వివిధ రాష్ట్రాల్లోనూ పర్యటించారు .

ఈ సందర్భంగా బిజెపి నేతలతో( BJP ) పాటు ,అనేక పార్టీల నేతలను ఆయన కలిశారు.రజనీకి గవర్నర్ పదవి పై బిజెపి హామీ ఇచ్చిందని, అందుకే కొన్ని రాష్ట్రాల్లో ఆయన ప్రత్యేకంగా పర్యటిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.వాస్తవంగా రజనీకాంత్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేశారు.సొంతంగా పార్టీ పెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.కానీ చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుని రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు.మళ్ళీ సినిమాల్లోనే యాక్టివ్ అయ్యారు.
కానీ రజనీకి ఉన్న చరిష్మాను ఉపయోగించుకునేందుకు బిజెపి పావులు కదుపుతోంది.

ముఖ్యంగా తమిళనాడులో బలపడాలని చూస్తున్న బిజెపి రజనీకాంత్ ఇమేజ్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.దీనిలో భాగంగానే ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చేందుకు సిద్ధమైందని, రజిని కూడా గవర్నర్ పదవిని తీసుకునేందుకు సిద్ధంగానే ఉన్నారని , గవర్నర్ పదవికి రాజకీయం ఏమి ఉండదు కాబట్టి, ఆ పదవి తీసుకున్నా, తనకు పెద్దగా ఇబ్బంది ఉండదు అనే ఆలోచనతో రజిని ఉన్నారట. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ ,గవర్నర్ పదవి రాబోతుందనే ప్రచారంపై ఆయన అభిమానులు మాత్రం ఉత్సాహంగా ఉన్నారు.