పుంగనూరు దాడి కేసు సుప్రీమ్ ను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం..!!

చిత్తూరు జిల్లా పుంగనూరులో( Punganur ) నెల రోజుల క్రితం టీడీపీ…వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవటం తెలిసిందే.ఈ క్రమంలో ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం జరిగింది.

 Punganur Attack Case Ap Govt Approached Supreme Details, Punganur Attack, Supre-TeluguStop.com

అయితే దాడిన ఆపే ప్రయత్నంలో పోలీసులపై కూడా రాళ్లు రువ్వడం జరిగింది.పోలీసు వాహనాలను దగ్ధం చేశారు.

ఈ ఘటనలో కొంతమంది పోలీసులు తీవ్రంగా గాయపడటం కూడా జరిగింది.దీంతో పుంగనూరు ఘటనను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు.

పోలీసులపై దాడి జరగటంతో పలు సెక్షన్ ల కింద కేసులు కూడా పెట్టడం జరిగింది.ఈ కేసులో 500 మంది నిందితులను గుర్తించినట్లు వేలల్లో 92 మందిని అరెస్టు చేసినట్లు అప్పట్లో జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి( SP Rishant Reddy ) స్పష్టం చేయడం జరిగింది.

ప్రీ ప్లాన్ గా పోలీసులపై దాడి చేశారని ఈ కేసులో నిందితుడైన పుంగునూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా బాబు,( Challa Babu ) గోవర్ధన్ రెడ్డి,( Govardhan Reddy ) డ్రైవర్ నరీన్ కుమార్ రిమాండ్ రిపోర్టులో అంగీకరించినట్లు తెలిపారు.వీడియో ఫుటేజ్ ఆధారంగా మొత్తం 500 మందిని గుర్తించినట్లు.92 మందిని అరెస్టు చేసినట్లు ఇంకా 408 మందిని ట్రేస్ చేయాల్సి ఉందని స్పష్టం చేయడం జరిగింది.అయితే ఈ ఘటనలో అరెస్టయినా నిందితులకు ఇటీవల బెయిల్ రావడం జరిగింది.

ఈ పరిణామంతో పుంగనూరు దాడిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును( Supreme Court ) ఆశ్రయించింది.నిందితుల బెయిల్ కి సంబంధించి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube