యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి( Naveen Polishetty ) జాతిరత్నాలు సినిమా తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.అంతకు ముందు నాలుగు అయిదు సంవత్సరాల పాటు హీరోగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశాడు.
కానీ జాతిరత్నాలు సినిమా తర్వాత మాత్రమే ఆయనకు సక్సెస్ దక్కింది.జాతిరత్నాలు( Jathi Ratnalu ) సినిమాకి సక్సెస్ దక్కినా కూడా ఆ సక్సెస్ ను నవీన్ పొలిశెట్టి క్యాష్ చేసుకోవడంలో విఫలం అయ్యాడు.
ఆయన హీరోగా రెండు సినిమా లు చాలా కాలం క్రితమే ప్రారంభం అయ్యాయి.కానీ ఇప్పటి వరకు విడుదల కాలేదు.
ఎట్టకేలకు అనుష్క( Anushka Shetty ) తో కలిసి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా విడుదలకు సిద్ధం అయింది.ఈ సినిమా లో అనుష్క కు జోడీగా నవీన్ పొలిశెట్టి నటించడం ను చాలా మంది విమర్శించారు.అంతే కాకుండా ఈ సినిమా వల్ల దాదాపుగా రెండేళ్ల సమయం ను నవీన్ వృదా చేసుకున్నాడు.ఒక వేళ ఈ సినిమా ను కనుక కమిట్ అవ్వకుండా ఉండి ఉంటే కచ్చితంగా రెండు మూడు సినిమా లు చేసి ఉండేవాడు.
అందుకే నవీన్ పొలిశెట్టి సినిమా లు చాలా ఆలస్యం అయ్యాయి.నవీన్ పొలిశెట్టి భారీ ఎత్తున సినిమా లు చేసే అవకాశాలు ఉన్నా కూడా ఆయన చేయలేదు.అనుష్క తో సినిమా అనగానే కళ్లు మూసుకుని నవీన్ పొలిశెట్టి ఓకే చెప్పి తప్పు చేశాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అయితే రెండు రోజుల్లో సినిమా విడుదల అవ్వబోతున్న నేపథ్యం లో నవీన్ పొలిశెట్టి చేసింది తప్పా ? ఒప్పా? అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.అనుష్క తో పాటు నవీన్ పొలిశెట్టి కి సంబంధించిన వరుస సినిమా ఆఫర్లు మిస్ చేసుకున్నాడు అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.అయితే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా కనుక సక్సెస్ అయితే మరింత జోరుగా నవీన్ పొలిశెట్టి కెరీర్ ఉంటుందని ఆయన అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.