1.మరో మూడు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.దీని కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
2.కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు
నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి.స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో ఈ సమావేశాలు జరగనున్నాయి.
3.ఎమ్మెల్సీ కవిత కామెంట్స్
సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.కవిత నివాసంలో జరిగిన సింగరేణి కాంట్రాక్ట్ టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
4.మధు యాష్కీ కి వ్యతిరేకంగా పోస్టర్లు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ కి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.గాంధీభవన్ గోడలపై అతికించిన ఈ పోస్టర్లు ఇప్పుడు పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
5.కేటీఆర్ కామెంట్స్
కాంగ్రెస్, బిజెపిలపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.డబల్ ఇంజన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకునే బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు, కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లోనూ విద్యుత్ లోటు ఉందని కేటీఆర్ విమర్శించారు.
6.పలు రైళ్లు రద్దు
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
7.చంద్రబాబుపై కొడాలి కామెంట్స్
టీడీపీ అధినేత చంద్రబాబుపై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు చేశారు.రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు.420.దొంగ చట్టాలను అడ్డం పెట్టుకొని డబ్బులు ఎలా దోచుకోవాలో ఎలా దాచుకోవాలో తెలిసిన వ్యక్తి అంటూ నాని విమర్శించారు.
8.బిజెపి దరఖాస్తుల ఆహ్వానం
అసెంబ్లీకి పోటీ చేయబోయే బిజెపి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు నేటి నుంచి స్వీకరిస్తోంది.
9.రజనీపై విమర్శలు రోజా క్లారిటీ
చంద్రబాబు పాలనపై కొద్దిరోజుల కిందట తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో వైసిపి నాయకులు ఆయనపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి రోజా స్పందించారు రజినీకాంత్ వ్యాఖ్యలపై తాను విమర్శలు చేయలేదని ఖండించాను అని వివరణ ఇచ్చారు.
10.చంద్రబాబు లోకేష్ పై మంత్రి విమర్శలు
చంద్రబాబు ను ప్రజా కోర్టులోకి ఈడుస్తాం , అక్కడ సమాధానం చెప్పాలి.చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ శిక్ష అనుభవించక తప్పదు అని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.
11.లోకేష్ పై ఎంపీ భరత్ విమర్శలు
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు చేశారు.ఓయ్ ముద్దపప్పు నోరులేస్తుంది ఏంటి అంటూ లోకేష్ ను ఉద్దేశించి అనేక ప్రశ్నలు స్పందించారు.
12.అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ఏపీ ప్రభుత్వం అప్పులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు.
13.బిజెపి నుంచి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి సస్పెన్షన్
బిజెపి తెలంగాణ ఉపాధ్యక్షుడిగా ఉన్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి పై ఆ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది.
14.రేణుక చౌదరి కామెంట్స్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధిష్టానం షర్మిలపై కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి వ్యక్తం చేశారు.ఇన్నాళ్లకు తెలంగాణ కోడలు.అనే విషయం గుర్తుకు వచ్చిందా అంటూ ఆమె మండిపడ్డారు.
15.ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
జెమిలి ఎన్నికలపై ప్రతిపక్షాలకు ఎందుకు అంత భయం అని బిజెపి ఎంపీ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
16.రేవంత్ పై గోనె ప్రకాశరావు విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు తీవ్ర విమర్శలు చేశారు.
జమిలి ఎన్నికల పై కమిటీ ఒక డ్రామా అని ప్రకాష్ రావు అన్నారు.రేవంత్ రెడ్డి షర్మిలను ఆంధ్ర అంటున్నారని, సిపిఐ ఎంఐఎం సమైక్య నినాదం ఇచ్చాయి వాటితో పొత్తులకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డికి సిగ్గు లేదని విమర్శించారు.
17.పొంగులేటి, తుమ్మలపై మంత్రి పొవ్వాడ విమర్శలు
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.వారివి సికండి రాజకీయాలు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
18.శంషాబాద్ లో G20 ప్రత్యేక సదస్సు
ఈనెల 9 10 తేదీల్లో ఢిల్లీలో జి20 సదస్సు జరగనుంది.దీనిలో భాగంగా శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో వ్యవసాయంపై నిర్వహిస్తున్న ప్రత్యేక సదస్సు ప్రారంభమైంది.వాతావరణ ప్రతికూలతలను తట్టుకోగల వ్యవసాయంపై ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
19.తెలంగాణ వైద్య మండలికి ఎన్నికలు
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర వైద్య మండలికి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి.రాష్ట్రంలోని 48,405 వైద్య ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 13 మంది మండలి సభ్యులను ఎన్నుకొన్నారని, రాష్ట్ర ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ జి హనుమాన్లు తెలిపారు.
20.ముఖ్య నేతలకు కేసీఆర్ పిలుపు
కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ ముఖ్య నేతలు తనను కలవాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు.