యాచక పేరుతో బలవంతంగా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు

యాచక పేరుతో బలవంతంగా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు శుభకార్యలల్లో హల్‌చల్‌ చేస్తున్న హిజ్రాలకు త్రీ టౌన్ పోలీసుల కౌన్సిలింగ హిజ్రాలు సమాజంలో గౌరవంగా బతకాలి.ప్రవర్తన మారకుంటే కఠిన చర్యలు తప్పవు హిజ్రాలు వేధిస్తే 100కు డయల్ కాల్ చేయండి ఖమ్మం టౌన్ ఏసీపీ ఎస్వీ హరికృష్ణ( SV Harikrishna )శుభకార్యలల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న నాలుగురు హిజ్రాలను ఖమ్మం తాసిల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ ఎస్వీ హరికృష్ణ తెలిపారు.

 Khammam , Hijra , Sv Harikrishna-TeluguStop.com

ఖమ్మం( Khammam )తో పాటు ఇతర ముఖ్య పట్టణాల్లో హిజ్రాలు దాడులకు దిగుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు అందుతున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ ఆదేశాల మేరకు ఖమ్మం టౌన్ ఏసీపీ ఆధ్వర్యంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో హిజ్రాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ .శుభకార్యలల్లో హిజ్రాలు చేస్తున్న వికృత చేష్టల పై దృష్టి పెట్టామని తెలిపారు.శుభకార్యలకు వెళ్లే హిజ్రాలు( Hijra ) అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేయడం, అందుకు నిరాకరిస్తే అసభ్యకర రీతిలో అక్కడే అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ.కుటుబ సభ్యులు భయపడేలా చేసి కావల్సిన డబ్బులు బలవంతంగాతీసుకొని వెళ్లిపోవడం జరుగుతుందని అన్నారు.

అదేవిధంగా బస్‌స్టాండు,రైల్వే స్టేషన్, ప్రధాన కూడళ్ళలో వ్యాపారులను, ప్రజలను బెదిరించడం, దౌర్జన్యాలు, భయభ్రంతులకు గురి చేస్తున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం ఆయితే ఉపేక్షించేది లేదని అన్నారు.

పెళ్లి మండపాలల్లో ఘర్షణపడి శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

గోడలపై, ఫంక్షన్ హాల్ వద్ద వర్గాల పేర్లు రాసి బలవంతపు వసూళ్లకు దిగితే డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారుహిజ్రాలకు సహకరించి, ప్రోత్సహించే ఆటో డ్రైవర్లపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.సమాజంలో హిజ్రాలు గౌరవంగా బతకాలని.

ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు.కార్యక్రమంలో త్రీ టౌన్ సిఐ సత్యనారాయణ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube