ఆ పడవ నడవాలంటే ఎండ వుండాలంట... ఎందుకో తెలుసా?

సాధారణంగా నాటు పడవలు( boats ) అనేవి తెడ్ల సాయంతో నడుస్తాయి.ఆదేరకంగా మరపడవలు నడవాలంటే ఇంధనం కావాల్సిందే.

 For That Boat To Sail, It Must Be Sunny Do You Know Why, Boats, Fuel Boats, Rech-TeluguStop.com

ఇక ఎలక్ట్రిక్‌ పడవలను నడపడానికి రీచార్జబుల్‌ బ్యాటరీలు వుండడం చాలా అవసరం.ఈ మూడింటి గురించి అందరికీ తెలిసినదే.

అయితే ఇపుడు కొత్తగా జలారుల అభ్యున్నతి కోసం నాలుగో రకానికి చెందిన పడవలు పుట్టుకొచ్చాయి.ఈ పడవలు అనేవి పూర్తిగా సౌరశక్తితో నడుస్తాయి.

దీని పైకప్పు మీద అమర్చిన సౌరఫలకాలు ఇందులోని 200 వాట్ల విద్యుత్తును నిరంతరం బ్యాటరీకి చార్జ్‌ చేస్తుంటాయి.

Telugu Automobile, Electric, Fuel, Rechargeable, Roof, Solar Panels, Solar Power

దీని ఫీచర్ల విషయానికొస్తే… బ్యాటరీ సామర్థ్యం వచ్చేసి 1.3 కిలోవాట్లు.అందుకే ఈ పడవలో రేయింబవళ్ళు పయనించినా ఎలాంటి ఇబ్బంది వుండదు.

ఇక పొడవు విషయానికొస్తే పదిహేనుడు అడుగులు, వెడల్పు వచ్చేసి ఎనిమిది అడుగులు కలిగి వుంటుంది.కాగా ఈ పడవలో ఏకకాలంలో ఆరుగురు వరకు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

నదులు, సరస్సుల్లో విహారయాత్రలకు పూర్తిగా అనువుగా ఉండే ఈ పడవ గంటకు ఆరు నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందని దాని మేకర్స్ చెబుతున్నారు.

Telugu Automobile, Electric, Fuel, Rechargeable, Roof, Solar Panels, Solar Power

అయితే ఇది మనదగ్గర పడవ కదండోయ్.అమెరికన్‌ కంపెనీ ‘గోసన్‌’( Gosan ) ఇటీవల ఈ సోలార్‌ పడవను మార్కెట్‌లోకి తెచ్చింది.ఇది అక్కడి స్థానిక జాలరుల కోసమే ప్రత్యేకంగ తయారు చేసినట్టు చెబుతున్నారు.

ఇక ఇందులోని అనేక రకాల డిజైన్లు కూడా కలవు.పడవ డిజైన్ హంగులను బట్టి ధర 7,950 నుంచి 12,750 డాలర్ల వరకు వుంటుంది.అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.6.60 లక్షల నుంచి 10.59 లక్షల వరకు ఉంటుంది.కాబట్టి దీనిని కొనడం ఒకింత భారమే అయినప్పటికీ ఒన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు.ఇక మనదేశానికి ఇవి కావాలంటే మరింత ఖర్చుతో కూడుకున్న పని.అన్నీ టాక్సులను కలుపుకొని మొత్తం ఎనిమిది లక్షలు అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube