తెలుగు సినీ ప్రేక్షకులకు బిగ్ బాస్ ఫేమ్ నటుడు మానస్( Maanas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మానస్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు.
బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వక ముందు పలు సీరియల్స్ లో నటించి మెప్పించారు.ఇక బిగ్ బాస్ షో తర్వాత మరిన్ని అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.
ఇకపోతే ఈ ప్రస్తుతం మానస్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో( Brahmamudi Serial ) హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సీరియల్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.అంతేకాకుండా వరుసగా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు.ఇది ఇలా ఉంటే తాజాగా మానస్ ప్రేక్షకులకు అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు.
అదేమిటంటే తాజాగా మానస్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో నిశ్చితార్థం( Maanas Engagement ) ఫోటోలు షేర్ చేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.మానస్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నారు.
శ్రీజ నిశ్శంకరతో( Srija Nissankara ) ఆయన నిశ్చితార్థం శనివారం వేడుకగా ఘనంగా జరిగింది.నగరంలోని ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకలో బుల్లితెర తారలు సందడి చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వైరల్‌గా మారాయి.

వీటిని చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.అయితే ఎటువంటి అప్డేట్ లేకుండా ఒక్కసారిగా ఎంగేజ్మెంట్ ఫొటోస్ షేర్ చేయడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
కాగా మానస్ ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తూనే కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్‌లో డ్యాన్స్‌లు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.







