రెండు టికెట్ల ఇవ్వాల్సిందే ! కాంగ్రెస్ లో పెరుగుతున్న డిమాండ్ 

త్వరలోనే పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ( Congress party )కు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది.కీలక నాయకులు కోరుతున్న కోరికలు ఇబ్బందికరంగా మారాయి.

 Two Tickets Must Be Given Increasing Demand In Congress , Brs , Telangana Ele-TeluguStop.com

ఒకవైపు అధికార పార్టీ బీఆర్ఎస్( BRS party ) ఇప్పటికే తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.బిజెపి కూడా నేటి నుంచి ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్ దరఖాస్తుల ప్రక్రియను ముగించింది.అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒడబోత కార్యక్రమం జరుగుతుంది.

త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుండగా,  ఇప్పుడు ఆ పార్టీలో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కాంగ్రెస్ ఆహ్వానించింది .వెయ్యికి పైగా దరఖాస్తులు అందాయి.ఇందులో ఎక్కువగా ఇల్లందు నియోజకవర్గం నుంచి 38 దరఖాస్తులు రాగా,  అత్యల్పంగా జగిత్యాల, కొడంగల్ నుంచి ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయి.

అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కసరత్తు జరుగుతోంది.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరగడం,  బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ బలం పెంచుకుందని, అధికారంలోకి రావడం ఖాయం అనే సర్వే నివేదికల నేపథ్యంలో , కొంతమంది కీలక నేతలు రెండు టిక్కెట్లు ప్రతిపాదనను తెరపై తీసుకువచ్చారు.

Telugu Mulugu Mla, Sithakka, Telangana-Politics

 తమతో పాటు తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది.ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో చోటు దక్కకపోవడంతో,  ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.అయితే తనతో పాటు తన భర్త శ్యామ్ నాయక్ కు కూడా టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు .అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సీట్లు గెలవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి దూరమైనా రేఖా నాయక్ చేరబోతుండడం బలంగా మారబోతోంది.అయితే రెండు టిక్కెట్ల ప్రతిపాదన విషయంలోనే తర్జనభజన పడుతోంది.

ఇక మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కూడా రెండు టికెట్లను డిమాండ్ చేస్తున్నారు .మహబూబాబాద్ నుంచి తాను పోటీ చేస్తానని , తనతో పాటు తన కుమారుడుకి కూడా టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.అలాగే మాజీ మంత్రి కొండ సురేఖ సైతం తమ కుటుంబం నుంచి రెండు టికెట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు.  వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతుండగా , రెండో టికెట్ గా పరకాల లేదా భూపాలపల్లి స్థానాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.

  సురేఖ భర్త కొండా మురళి లేదా కుమార్తె సుస్మిత లలో ఎవరో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని సురేఖ డిమాండ్ చేస్తున్నారు.

Telugu Mulugu Mla, Sithakka, Telangana-Politics

 ఇక మాజీ ఉప ముఖ్యమంత్రి సీనియర్ నేత దామోదర రాజనర్సింహ( Damodara Rajanarsimha ) కూడా రెండు టిక్కెట్లు ఆశిస్తున్నారు.తనతో పాటు తన కుమార్తెకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు ఇటీవల సిడబ్ల్యుసిలో శాశ్వత ఆహ్వానితుడిగా నియమితుడైన రాజా నరసింహ సైతం ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారు.ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మరో సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా రెండు టికెట్లు కోరుతున్నారు.

పెద్ద కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.ఇదేవిధంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క( Seethakka ) కూడా తన కుమారుడు సూర్యకు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు.

సీతక్క కుమారుడు పినపాక నియోజకవర్గం లో ఈ మధ్యకాలంలో విస్తృతంగా పర్యటిస్తూ , టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారు.అయితే ఇటీవల పొంగులేటి వర్గానికి చెందిన పాయం వెంకటేశ్వర్లు పొంగులేటితో పాటు పార్టీలో చేరడంతో చేతక్క కుమారుడికి అనుమానంగా మారింది అయితే సీతక్క కు రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉండడంతో రెండో టిక్కెట్ పై ఆమె ధీమాతో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube