వన్డే చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కానీ సరికొత్త రికార్డును శ్రీలంక జట్టు( Sri Lanka ) సృష్టించింది.వరుసగా ఆడిన 11 మ్యాచ్లలో ప్రత్యర్థి జట్టులను ఆల్ అవుట్ చేసి, శ్రీలంక ఓ సరికొత్త చరిత్రని సృష్టించింది.
ఆసియా కప్ లో బంగ్లాదేశ్ ను( Bangladesh ) ఆల్ అవుట్ చేయడం ద్వారా ఈ ఘనతను శ్రీలంక సాధించింది.శ్రీలంక సరికొత్త రికార్డులను బద్దలు కొట్టడం అనేది అసాధారణమైనదేమీ కాదు.
శ్రీలంక ఆటగాళ్లు అన్ని విభాగాలలో చాలా మెరుగ్గా ఉంటారు.బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో మిగతా జట్లతో పోలిస్తే చాలా బెటర్ అన్నట్టుగా శ్రీలంక జట్టు ఉంటుంది.

శ్రీలంక జట్టు వరుసగా ఆడిన 11 మ్యాచ్లలో, తొమ్మిది సందర్భాలలో మొదటి 10 ఓవర్లలోనే మొదటి వికెట్ తీయడం వల్ల ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరిగింది.దీంతో శ్రీలంక జట్టు పై చేయి సాధించడానికి పలు అవకాశాలు దొరికాయి.శ్రీలంక జట్టు యువ పేస్ బౌలర్లైన మతీషా పతిరనా,( Mateesha Pathirana ) మహేష్ తీక్షణ( Mahesh Teekshana ) ప్రత్యర్థి జట్లను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.మతీషా పతిరనా 11 మ్యాచ్లలో ఏకంగా 17 వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు.
మహేష్ తీక్షణ 11 మ్యాచ్లలో 15 వికెట్లు పడగొట్టి విశేషంగా ఆకట్టుకున్నాడు.

తాజాగా ఆసియా కప్ లో భాగంగా శ్రీలంక-బంగ్లాదేశ్( Sri Lanka vs Bangladesh ) మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు తొలి 10 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 36 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది.బంగ్లాదేశ్ జట్టు బ్యాటర్లైన నజ్ముల్ శాంటో, తౌహిద్ హృదయ్ 59 పరుగుల భాగస్వామ్యం అందించిన.చివరకు 164 పరుగులకే బంగ్లాదేశ్ ఆల్ అవుట్ అయింది.
అనంతరం లక్ష్య చేదనకు దిగిన శ్రీలంక జట్టు ఆరంభంలో ఓపెనర్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.కానీ సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక 78 పరుగుల భాగస్వామ్యం అందించడం వల్ల జట్టు కోలుకుంది.ఇక శ్రీలంక జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.4 వికెట్లు తీసిన మతీషా పతిరనా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.







