తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో రాబోవు కొన్ని నెలల్లో ఎన్నికల నగరా మోగబోతోంది.ఈ తరుణంలో అధికార బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టేందుకు బిజెపి పార్టీ కూడా సమయత్తమవుతోంది.
సరికొత్త స్టాటజీతో ముందుకు పోతోంది.ఇదే క్రమంలో ఈసారి బిజెపి ( BJP ) లో కీలక నేతలైనటువంటి వారందరినీ, బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నటువంటి మంత్రులపై పోటీకి దింపేలా సన్నాహాలు చేస్తుంది.
దానికి సంబంధించిన జాబితాను కూడా విడుదల చేసింది.ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గజ్వేల్.
ఈ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అయితే కేసీఆర్ పై ఈటల రాజేందర్ ఈసారి గజ్వేల్ ( Gajwel) లో పోటీ చేయనున్నారు.

మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) పై ఈటెల గెలుపొందుతారా.? తనకు బ్రాండ్ గా ఉన్నటువంటి హుజురాబాద్ వదులుకొని అక్కడ పోటీ చేస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి.? హుజురాబాద్ మళ్లీ తనను యాక్సెప్ట్ చేస్తుందా.?అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ కీలకమైన నేత.ఆయన 2004 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్థిపై విజయం సాధించారు.
ఆ తర్వాత 2008 ఉప ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఇక 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్, హుజురాబాద్ ( Huurabad ) గా మారింది.
ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా మరోసారి గెలుపొందారు.అలా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తర్వాత 2014, 2019లో కూడా హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత 2021లో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మరోసారి 23 వేల మెజారిటీతో గెలుపొందారు.ఈ విధంగా హుజురాబాద్ ప్రజలకు ఎంతో ఆప్తుడిగా ఉండే ఈటల రాజేందర్ ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) పై గజ్వేల్ లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.మరి కేసీఆర్ ను తట్టుకొని గజ్వేల్ లో నిలబడకడుగుతారా.? ఒకవేళ అక్కడ ఓడిపోతే, తనను ఎంతో ఆదరించిన హుజురాబాద్ సీటు కూడా చేజారినట్టు అవుతుంది.ఎందుకంటే ఆయన గజ్వేల్ లో పోటీ చేస్తే హుజురాబాద్ లో మరొకరు పోటీ చేస్తారు.లేదంటే ఆయన సతీమణిని పెట్టినా, ఆయనకు ఉన్నంత విజన్ ఆమెకు ఉండకపోవచ్చు.
కేవలం ఈటల అనే పేరుపైనే హుజురాబాద్ లో గెలుస్తున్నారు తప్ప పార్టీ బేస్ ఏమీ ఉండదు.అలాంటి ఈటల హుజురాబాద్ ను వదులుకొని, గజ్వేల్ లో ఓడిపోతే రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది.







