తెలంగాణలో అధికారంలోకి అధికారం కోసం కమలం పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది.సౌత్ రాష్ట్రాలలో కర్నాటక( Karnataka ) తరువాత అంతో ఇంతో బలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణనే.
కర్నాటకలో ఉన్న అధికారం అనూహ్యంగా చేజారింది.దీంతో ఇప్పుడు సౌత్ లో నిలబడలంటే ఎలాగైనా తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటల్సిన పరిస్థితి.
దాంతో వేసే ప్రతి అడుగును వ్యూహతమకంగానే వేస్తోంది కమలం పార్టీ.ఇక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం మొదటి జాబితా అభ్యర్థులపై ముమ్మర కసరత్తులు చేస్తోంది.
అయితే అధికార బిఆర్‌ఎస్ ను ఎదుర్కొనేందుకు కాషాయ పెద్దలు అనుసరిస్తున్న వ్యూహమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

బిఆర్‌ఎస్( Brs ) లోని ప్రధాన నేతలే టార్గెట్ గా త్వరలో ప్రకటించబోయే తొలి జాబితా ఉండబోతుందనేది రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.సిఎం కేసిఆర్ రెండు చోట్ల పోటీ చేయబోతుండగా గజ్వేల్ లో కేసిఆర్ ( KCR )కు పోటీ గా ఈటెల ను బరిలో దించాలని అధిస్థానం ప్లాన్ చేస్తోందట.అలాగే కామారెడ్డి నుంచి ధర్మపురి అరవింద్ బరిలో దించనుందట.
ఇక బిఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ చైర్మెన్ కేటిఆర్ కు పోటీగా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నిలబడడం దాదాపు ఖాయమే అని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక అదే విధంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సబితా ఇంద్రరెడ్డిపై( Sabitha Indra Reddy ) కొండ విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్ లో గంగుల కమలాకర్ పై గుజ్జుల రామకృష్ణ రెడ్డి.
ఇక బిఆర్‌ఎస్ ముఖ్య నేతలపై బీజేపీలోని ప్రధాన నేతలను బరిలో దించాలనే బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తోందట.

కాగా కేసిఆర్ ను ఢీ కొట్టి అటు గజ్వేల్ లో ఈటెల( etela ) ఇటు కామారెడ్డిలో ధర్మపురి అరవింద్.ఇద్దరు గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారే అవకాశం ఉంది.ఒకవేళ ఓడిపోతే ఇద్దరినీ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ బరిలో దించవచ్చనే ప్లాన్ అధిష్టానం చేస్తోందట.
అటు బండి సంజయ్ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు అయ్యారు.అందుకే ఈసారి ఏకంగా కేటిఆర్ కు పోటీగా బరిలో దించితే గెలిస్తే సెన్సేషన్.ఒడితే మళ్ళీ గో టూ పార్లమెంట్ అనవచ్చనే వ్యూహంలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.మరి కమలం పార్టీ పెద్దల మాస్టర్ ప్లాన్ ఎంతవరుకు వర్కౌట్ అవుతుందో చూడాలి.







