‘ఈరోజుల్లో’ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో మీరే చూడండి!

సపరేట్ జానర్లో సినిమాలు తీసే దర్శకుడు మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ రోజుల్లో సినిమా( Ee Rojullo )తో ఇండస్ట్రీకి పరిచయం అయిన అచ్చ తెలుగు అందం రేష్మా రాథోడ్.తొలుత టీవీ దర్శకురాలు మంజులా నాయుడు ఆమెను చూసి టీవీ సీరియల్స్‌లో నటించమని సూచించారు.

 Do You Remember The Heroine Of The Movie Ee Rojullo Now See How Hot It Is , Ee-TeluguStop.com

అలా ‘మొగలిరేకులు’ సీరియల్ తో బుల్లి తెరకు పరిచయం అయ్యారు రేష్మా రాథోడ్( Reshma Rathore ) ఆ సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించే అవకాశం వచ్చింది.అయితే తొలిసారిగా ఆమెకు దర్శకుడు మారుతి “ఈ రోజుల్లో” చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం కల్పించాడు.

ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తనకు మరికొన్ని చిత్రాలలో అవకాశాలు వచ్చాయి.

అలా ఆమెకు జైశ్రీరామ్ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది.రేష్మా రాథోడ్ అసలు పేరు భూక్యా రేష్మాబాయ్‌.రేష్మా తల్లి రాధాబాయ్, ఆమె హైకోర్టు లాయర్ గా పనిచేశారు.

రేష్మా కూడా తొలుత లా కోర్సు పూర్తి చేసి న్యాయవాదిగానే తన కెరీర్ కొనసాగించాలని భావించారు.కానీ మంజులా నాయుడు( Manjula Naidu ) సలహాలో ఇండస్ట్రీకి వచ్చింది.

కానీ కొద్ది కాలమే తను సినిమాల్లో నిలదొక్కుకోగలిగింది.తనకు అవకాశాల్లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయింది.

ఆమె కెరీర్ ఆఖర్లో ‘భారతీయ జనసంఘ్‌’ వ్యవస్థాపకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ చిత్రంలో ప్రస్తుతం రేష్మా, ఆయన సతీమణి సుధాదేవిగా నటించారు.ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

రేష్మా రాథోడ్ పదిహేనేళ్ల వయసులోనే బీజేపీ యువ మోర్చా కార్యకర్తగా సేవలందించారు.తను పదోతరగతి పూర్తి కాక ముందే బాలికలకు పెళ్లిళ్లు చేసే పద్ధతులను తండాల నుంచి తరిమేందుకు తన వంతు ప్రయత్నం చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.సినిమాల్లో అవకాశాలు లేకపోయిన తను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.ఎప్పటికప్పుడు తన నిజ జీవితానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గర్లోనే ఉంటున్నారు.

తాజాగా రేష్మా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసిన ప్రేక్షకులు మళ్లీ తను సినిమాల్లోకి వస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube