ఆ భయం వల్లే మహేష్ బాబు రీమేక్ సినిమాలకు దూరంగా ఉన్నారా.. ఏం జరిగిందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu )కు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో మహేష్ బాబు నటించారు.

 Reasons Behind Mahesh Babu Away From Remakes Details Here Goes Viral In Social M-TeluguStop.com

తను నటించిన సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించేలా మహేష్ బాబు జాగ్రత్తలు తీసుకున్నారు.తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇవ్వడానికి మహేష్ బాబు ముందువరసలో ఉంటారు.

Telugu Guntur Karam, Mahesh Babu, Sreeleela, Tollywood, Trivikram-Movie

అయితే తెలుగులో చాలామంది హీరోలు రీమేక్ సినిమాలలో నటించినా మహేష్ బాబు మాత్రం రీమేక్ సినిమాలకు దూరంగా ఉన్నారు.అయితే మహేష్ బాబు రీమేక్ సినిమాలలో నటిస్తే పూర్తిస్థాయిలో న్యాయం చేయలేనని ఒరిజినల్ సినిమాలో నటించినట్టు మళ్లీ నటించాల్సి వస్తుందని భావిస్తారట.అదే సమయంలో రీమేక్ సినిమాలో నటించడం వల్ల కొత్త అనుభూతిని పంచలేమంటూ ఫీలవుతారట.

ఈ రీజన్ వల్లే మహేష్ బాబు రీమేక్ సినిమాలకు( Mahesh Babu Remake Movies ) దూరంగా ఉంటారని తెలుస్తోంది.

భవిష్యత్తులో సైతం మహేష్ బాబు రీమేక్ సినిమాలలో నటించే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది.మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తుండగా ఈ సినిమ పూర్తైన తర్వాత జక్కన్న డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలో నటిస్తున్నారు.

Telugu Guntur Karam, Mahesh Babu, Sreeleela, Tollywood, Trivikram-Movie

మహేష్ గుంటూరు కారం( Guntur Karam ) సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తో పాటు జీఎస్టీ తీసుకున్నారు.మహేష్ కు జోడీగా ఈ మూవీలో శ్రీలీల నటిస్తున్నారు.ఈ సినిమా డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయి.సంక్రాంతి కానుకగా గుంటూరు కారం మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా మూడో సినిమా అనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube