తెలంగాణలో ఎన్నికలకు( Telangana elections ) దగ్గరకు వచ్చేకొద్ది ప్రదాన పార్టీలు అన్నీ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి .అలవి గాని హామీలను ఇస్తూ తాము అధికారంలోకి రాగానే వాటన్నిటిని అమలు చేస్తామంటూ హడావిడి చేస్తున్నాయి.
ముఖ్యంగా కాంగ్రెస్ ఇ ప్పటికే రైతు మరియు యువత,ఎస్టీ ఎస్సీ డిక్లరేషన్ లను ప్రకటించింది.ప్రధానంగా రైతులతో పాటు మహిళలు కేంద్రంగా అనేక హామీలను ఇచ్చి వాటిని అమలు చేస్తామంటూ ప్రకటించింది.
అయితే కాంగ్రెస్ ఒకప్పుడు హామీ ఇచ్చిన చాలా పథకాలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో కూడా వాటిని అమలు చేయకుండా తెలంగాణలో హామీ ఇవ్వడం బట్టి దాని చిత్తశుద్ధి ఎంతో తేలిపోతుంది అంటూ అధికార బారాసతో పాటు భాజపా కూడా విమర్శిస్తున్నాయి అయితే కర్ణాటక( Karnataka )లో మధ్యప్రదేశ్ లో కూడా తామిచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని 90% హామీలను నెరవేర్చి మరో 10 శాతం త్వరలోనే నెరవేరుస్తామని, అందువల్ల తమ హామీలను నమ్మాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజలని కోరుతుంది .అదేవిధంగా భాజపా కూడా ఇప్పటికే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించి ఇప్పుడు గ్యాస్ ధరలను తగ్గించామని ముఖ్యమంత్రి మాత్రం వాటి ప్రయోజనం ప్రజలకుఅందేలా వ్యాట్ ని మాత్రం తగ్గించడం లేదంటూ అధికార బారాసపై ఎదురు దాడి చేస్తున్నారు.
మరోపక్క ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు( Welfare schemes ) అమలు చేస్తున్నబారసా కూడా తామా అధికారంలోకి వస్తే మరిన్ని కొత్త స్కీములను తీసుకొస్తామంటూ ప్రామిస్ చేస్తుంది.ఇలా ప్రతి పార్టీ కూడా తమ హామీలనే నమ్మాలని ఇతర పార్టీలను నమ్మవద్దని తమ తోనే కలసి నడవాలని ప్రజలను ప్రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఒకసారి ఎన్నికల కౌంట్ డోన్ మొదలైతే మరిన్ని కొత్త పథకాలు స్కీములతో ప్రత్యర్ధి పార్టీలపై పై చేయి సాధించడానికి తమ వంతు ప్రయత్నాలు అన్ని పార్టీలను చేసుకుంటున్నాయి.మరి తెలంగాణ ప్రజల మద్దతు దక్కించుకునే పార్టీ గా ఏది నిలబడుతుందో మరికొన్ని నెలల్లో తెలిపోతుంది
.