పుచ్చకాయ సాగు( Watermelon cultivation )కు వేసవికాలం మాత్రమే ఎక్కువగా అనుకూలంగా ఉంటుందని వ్యవసాయ క్షేత్రం నిపుణులు సూచిస్తున్నారు.కానీ వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు రావడం వల్ల ఈ పుచ్చకాయలను కూడా అన్ని కాలాల్లో పండిస్తున్నారు.
అయితే ఎరువుల యాజమాన్యం, సాగులో కొన్ని మెలుకువలు పాటిస్తేనే మంచి దిగుబడి పొంది అధిక లాభాలు అర్జించవచ్చు.అయితే అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న రైతులు ( Farmers )పూర్తి విస్తీర్ణాన్ని ఒకేసారి కాకుండా దఫ, దఫలుగా కొన్ని రోజుల వ్యత్యాసంలో విత్తుకుంటే పంటను మార్కెటింగ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది.

ఈ పుచ్చ సాగుకు సారవంతమైన ఇసుక నేలలు, నీరు ఇంకే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.నేల యొక్క పీహెచ్ విలువ 6.0 ఉండే నెలలలో అధిక దిగుబడి సాధించవచ్చు.రసాయన ఎరువుల( Chemical fertilizers )కు ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం సేంద్రియ ఎరువులకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇస్తే పంట నాణ్యత బాగా ఉంటుంది.
పంట వేసే నేలను ముందుగా రెండు లేదా మూడుసార్లు లోతు దుక్కులు దున్నుకొని, ఆఖరి దుక్కిలో ఒక ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 30 కిలోల యూరియ, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసి కలియదున్నుకోవాలి.ఆ తరువాత నేలను దమ్ము చేసి విత్తుకోవాలి.

పుచ్చకాయల సాగు అంటే సాధారణంగా ఎత్తుబెడ్ల పద్ధతి లేదంటే బోదెల పద్ధతి( Bodela method ) ద్వారా విత్తనం విచ్చేటప్పుడు జిగ్ జాక్ పద్ధతి అనుసరించి బోదేకు రెండు వైపులా మొక్కల మధ్య 75 సెంటీమీటర్లు, మొక్కల సాల మధ్య దూరం 120 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.ఇచ్చిన నెల రోజులకు ఒక ఎకరాకు 30 కిలోల యూరియ వేసుకోవాలి.మొక్కల వయసు 60 రోజుల కు రాగానే ఎకరాకు 15 కిలోల యూరియ, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి.మొక్కకు నాలుగు లేదా ఐదు ఆకులు ఉన్న సమయంలో ఒక లీటర్ నీటిలో మూడు గ్రాముల బోరాక్స్ ( Borax )కలిపి పిచికారి చేయాలి.
పూత సమయంలో కూడా ఈ బోరాక్స్ ను పిచికారి చేయడం వల్ల కాయలు పగలకుండా ఉంటాయి.







