ప్రత్యేకంగా తెలుగు భాషా దినోత్సవం ( Telugu Language Day )రాగానే పుష్కలంగా వాటికి సంబంధించిన పోస్టులు వస్తూనే ఉంటాయి.తెలుగు భాష గొప్పతనాన్ని వర్ణిస్తూ ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎవరికి తోచినట్టుగా వారు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు.
సినిమా ఇండస్ట్రీ విషయానికొస్తే తెలుగు భాష అనేది చాలా ఏళ్లుగా అత్యంత దారుణంగా కూనీ చేయబడుతూ వస్తోంది.ఎందుకంటే రాసేవారికి కానీ తీసే వారికి కానీ తెలుగు భాష పై పాటు లేకపోవడం ప్రధాన కారణం.
ఎవరో కొంత మంది తప్ప దాదాపు అందరూ తెలుగు విషయంలో తప్పులు చేస్తూనే ఉన్నారు.పైగా తెలుగు భాష ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో మార్కెట్ ను సొంతం చేసుకుంది.
ఇలాంటి సమయంలో కూడా పొరపాట్లు జరిగితే మన భాష పై పక్క భాష వారికి చిన్న చూపు వస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ పోస్టు పెట్టడం జరుగుతుంది.

తెలుగు భాష కూని అవుతుంది అని చెప్పడానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ చెప్తాను. చిరంజీవి, రామ్ చరణ్( Chiranjeevi , Ram Charan ) సంయుక్తంగా నటించిన సినిమా ఆచార్య( Acharya ).కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాదఘట్టం అనే ఒక ఎపిసోడ్ ఉంటుంది.ఈ చిత్రం ఎంత పెద్ద స్టార్ నటులతో నిండిపోయిందో మనందరికీ తెలుసు.కానీ పాదఘట్టం అనే పలకడం కూడా రాని నటీనటులను ఏమనాలో అర్థం కాని పరిస్థితి.
ఆచార్య సినిమాలో తనికెళ్ల భరణి( Tanikella Bharani ), చిరంజీవి మినహా మిగతా నటీనటులంతా కూడా బాధ ఘట్టాన్ని పాద ఘటం అనే పలికినట్టుగా సినిమా చూస్తే అందరికీ అర్థమవుతుంది.

ముఖ్యంగా సినిమా విషయానికి వచ్చేసరికి ‘క’, ‘ఖ’, ‘ల’, ‘ళ’ ఇలా కొన్ని జంట పదాలను సరిగ్గా పలకడం సాధన చేయాల్సి ఉంటుంది.ఈ మధ్య పాటలు కూడా కూనీ అవుతున్నాయి భాష కూనీ అవుతుంది.అందువల్ల సినిమా స్థాయి పెరుగుతున్నప్పుడైనా ఇలాంటి పొరపాటు చేయకుండా ఉంటే బాగుంటుంది.
కానీ ఈ విషయంలో కన్నడ సినిమా ఇండస్ట్రీ పట్టుదల మామూలుగా ఉండదు.వారు వారి భాష ఉచ్చరణ విషయంలో ఎంతో పట్టుదల కలిగి ఉంటారు.
మరి మనం కూడా ఎంతో కొంత అలాంటి పట్టుదల చూపిస్తేనే తెలుగు బ్రతుకుతుంది
.






