హార్ట్ ఎటాక్ చిత్రంతో టాలీవుడ్ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి ఆదాశర్మ (Adah Sharma) ఇలా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమె అనంతరం పలు సినిమాలలో నటించారు.అయితే తర్వాత సినిమాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి దీంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె తాజాగా ది కేరళ స్టోరీ ( The Kerala Story ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా ద్వారా నటి ఆదాశర్మకు సైతం మంచి పేరు ప్రఖ్యాతలు రావడమే కాకుండా సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.
ఇలా ఈమె తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.అయితే ఆదాశర్మ గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.ఈమె బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్( Sushanth Singh Rajputh ) అద్దెకు ఉన్నటువంటి ఫ్లాట్ కొనుగోలు చేశారు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్త వైరల్ గా మారింది.సుశాంత్ ముంబైలోని బాద్రాలో ఓ ఫ్లాట్లో అద్దెకు ఉండేవారు ఈయన నెలకు సుమారు 4.5 లక్షల రూపాయలు అద్దె చెల్లించి అక్కడ నివసించేవారు అయితే సుశాంత్ ఉన్నఫలంగా ఇదే ఫ్లాట్ లోనే ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే.
ఇలా సుశాంత్ మరణించిన తర్వాత ఎవరు కూడా ఆ ఫ్లాట్లో అద్దెకు రాలేదు అయితే ఆ ఫ్లాట్ కొనుగోలు చేయాలని చాలామంది ముందుకు వస్తున్నప్పటికీ ఇంటికి యజమాని మాత్రం ఆ ఇంటిని అమ్మనని తాను అద్దెకు మాత్రమే ఇస్తానని చెప్పేవారట.తాజాగా ఈ ఫ్లాట్ నటి ఆదాశర్మ కొనుగోలు చేశారంటూ ఓ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood Industry )లో చక్కర్లు కొడుతుంది.ఇలా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వగా ఈ వార్తలపై నటి ఆదాశర్మ స్పందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఒకవేళ అదే కనుక నిజమైతే అందరి నోరు తీపి చేస్తానని ఈ విషయాన్ని తానే స్వయంగా అందరితో పంచుకుంటాను అంటూ ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టారు.