భారత మార్కెట్లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో నుంచి Vivo V29e అధికారికంగా విడుదల అయింది.గతంలో వచ్చిన వివో V-సీరీస్ ఫోన్ల మాదిరిగానే ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ Vivo V29e ఫోన్ ఫోటోగ్రఫీ మరియు బడ్జెట్-ఫోకస్డ్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.
కానీ ప్రీమియం X సిరీస్ ఫోన్ల మాదిరి కాకుండా, ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ చాలా సరసమైనది.ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ధర, ఫీచర్స్ వివరాలు ఏమిటో చూద్దాం.

Vivo V29e స్మార్ట్ ఫోన్( Vivo V29e smartphone ) ఫీచర్ల విషయానికి వస్తే.7.57mm మందంతో సొగసైన డిజైన్ ను కలిగి ఉంది.ఈ ఫోన్ రిఫ్రెష్ రేట్ తో పూర్తి HD+ రిజల్యూషన్(2400*1080 పిక్సెల్)తో 6.73 అంగుళాల ఆమోలెట్ డిస్ ప్లే( Amoled display ) ను కలిగి ఉంటుంది.ఈ ఫోన్ ముందు ప్యానల్ లో 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.
ఈ ఫోన్ సెల్ఫీ కెమెరా ఐ ఆటో ఫోకస్ కి పూర్తి మద్దతు ఇస్తుంది.ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 695 SoC మరియు 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.44W చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరా సెన్సార్లు జోడించి ఉంటాయి.
ఒకటి 64- మెగాపిక్సెల్ OIS కెమెరా, మరోకటి 8 మెగా పిక్సెల్ యాంగిల్ కెమెరా కలిగి ఉంటుంది.ప్రీమియం లుక్ కోసం వెనుక భాగంలో గ్లాస్ ఫినిషింగ్ కూడా ఉంది.
ఈ ఫోన్ యొక్క కెమెరా యాప్ పోర్ట్రైట్, మైక్రో మూవీ, హై-రిజల్యూషన్, పానో, స్లో- మో, డబుల్ ఎక్స్ పోజర్, డ్యూయల్ వ్యూ, సూపర్ మూన్ మరియు లైట్ ఎఫెక్ట్ లతో ఉంది.

అంతేకాకుండా 5G, టైప్-C చార్జింగ్ పోర్ట్, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, ఆండ్రాయిడ్-13 ఆధారిత Funtouch OS మరియు ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.128GB మరియు 256GB స్టోరేజ్, 8GB RAM కాన్ఫిగరేషన్లలో రెండు మోడల్లలో వస్తుంది.భారత మార్కెట్లో దీని ధర రూ.26999 నుంచి మొదలై రూ.28999 వరకు ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఆర్టిస్టిక్ రెడ్, ఆర్టిస్టిక్ బ్లూ కలర్స్ లలో వస్తుంది.
ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ( Flipkart )మరియు వివో ఛానెల్ లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.








