గూగుల్ క్రోమ్ ని వెంటనే అప్డేట్ చేసుకోండి....లేదంటే ఈ అవకాశాన్ని మీరు వదులుకున్నట్టే!

గూగుల్( Google ) ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్ ల తో మనల్ని ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది.ఎప్పుడు టెక్ రేస్ లో ముందు ఉండే గూగుల్ ప్రజల అవసరాలకు తగ్గట్టు తన ప్రొడక్ట్స్ ని అప్లికేషన్స్ ని అప్డేట్ చేస్తూ ఉంటుంది.

 Now You Can Listen To The New In Google Chrome With Read Aloud Option Details, G-TeluguStop.com

తాజాగా గూగుల్ తన క్రోమ్ అప్లికేషన్ లో( Google Chrome ) ఒక కొత్త అప్డేట్ ను తీసుకురాబోతోంది.అదే స్పీచ్ ఫంక్షన్.

ఐతే ఈ అప్డేట్ ఎలా ఉపయోగపడుతుంది.ఎవరికి ఉపయోగపడుతుంది.

ఇది ఎప్పుడు అందుబాటు లోకి వస్తుంది.ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Chrome, Google Canary, Google Chrome, Latest, Read Aloud, Speech, Ups, Up

గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ క్రోమ్ లో స్పీచ్ ఫంక్షన్ ను( Speech Function ) ఇంట్రడ్యూస్ చేస్తోంది.మనం చాలా సార్లు గూగుల్ లోకి వెళ్లి రకరకాల వ్యాసాలు చదువుతూ ఉంటాం.ఇది చాలా టైం తీసుకుంటుంది.కొందరు ఫోన్ ని లేదా డెస్క్ టాప్ ని అదే పనిగా చూస్తూ ఉండడం వలన కంటి సమస్యలకు లోనవుతూ ఉంటారు.

ఐతే ఇప్పుడు గూగుల్ తీసుకువస్తున్న ఈ కొత్త “రీడ్ అలౌడ్”( Read Aloud ) ఆప్షన్ ఈ సమస్యలకు చెక్ పెట్టబోతోంది.ఈ ఆప్షన్ డెస్క్ టాప్ వెర్షన్ లో అందుబాటు లో ఉంటుంది.

గూగుల్ లో రీడింగ్ మోడ్ ను ఎంచుకోగానే మనం చదవాలనుకున్న వ్యాసాన్ని ఆ సాఫ్ట్వేర్ మనకు చదివి వినిపిస్తుంది.ఈ సదుపాయాన్ని గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ “గూగుల్ కానరీ” లో తీసుకురాబోతున్నట్టు సమాచారం.

Telugu Chrome, Google Canary, Google Chrome, Latest, Read Aloud, Speech, Ups, Up

ప్రస్తుతం ఈ సాఫ్ట్వేర్ ను పరీక్షిస్తోందట గూగుల్.ప్రాధమిక పరీక్షలు పూర్తి కాగానే మరిన్ని అప్డేట్ లు వచ్చే అవకాశం ఉంది.ఈ రీడ్ అలౌడ్ ఆప్షన్ విజయవంతం ఐతే ఇది టెక్ రంగం లో ఒక మైలు రాయి అనే చెప్పాలి.ఈ ఆప్షన్ రీడర్స్ కి చాలా సమయాన్ని ఆదా చేస్తుంది.

ఈ ఆప్షన్ పిడిఎఫ్, వర్డ్, ఈపబ్, గూగుల్ బుక్స్ వంటి వాటిని చదవడానికి ఉపయోగపడుతుంది.ఐతే ఈ టెక్స్ట్ ను వినిపించే వాయిస్ ఎలా ఉండబోతోందో అనే సందేహం ప్రజలలో ఉంది.

ఆ వాయిస్ మెకానికల్ గా కాకుండా, కాస్త హ్యూమన్ టచ్ తో వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube