స్టైలిష్ లుక్ లో విజయ్ దేవరకొండ.. డ్రెస్ అలా ఉందంటూ ట్రోల్స్?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన విజయ్ అదే సమయంలో అమ్మాయిలను, ప్రేక్షకులను కూడా తన వైపు మలుపుకున్నాడు.

 Vijay Deverakonda In A Stylish Look Trolls Saying The Dress Is Like That, Vijay-TeluguStop.com

చూడ్డానికి మంచి హ్యాండ్సమ్ గా, అందంగా ఉంటూ నిత్యం ట్రెండీగా కనిపిస్తూ ఉంటాడు.చిన్న చిన్న పాత్రలతో వెండితెరకు పరిచయం అయిన విజయ్ దేవరకొండ.2016 లో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అడుగుపెట్టి తొలిసారి నటనతో ఫిదా చేసాడు.ఆ తర్వాత నటించిన ద్వారక సినిమా లో అంత సక్సెస్ పొందలేకపోయాడు.

కానీ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డు సొంతం చేసుకున్నాడు.అర్జున్ రెడ్డి సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత కూడా పలు సినిమాలలో నటించగా.అంతగా సక్సెస్ కాలేకపోయాడు.ఇక పూరి జగన్నాద్ ( Puri Jagannad )దర్శకత్వంలో రూపొందిన్న లైగర్ సినిమాలో నటించగా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.ప్రస్తుతం సమంతతో ఖుషి ( Khushi )సినిమాలో నటించగా ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేశాడు.ఇక విజయ్ అప్పుడప్పుడు వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు.గతంలో హీరోయిన్ రష్మిక మందన్న తో కూడా ప్రేమాయణం నడిపాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.కానీ ఇప్పుడు తనకు దూరంగా ఉంటున్నాడని తెలుస్తుంది.

తన సినిమాలలో ఏ హీరోయిన్ తో నైనా మంచి రొమాంటిక్ సీన్ లు ఉండేలా చూసుకుంటాడు.ఇప్పటికి తను చేసిన సినిమాలలో చాలా వరకి రొమాంటిక్ సీన్స్ వచ్చాయి.

ఇక సమంతతో కూడా బాగా క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపిస్తున్నాడు.తాజాగా తను రాత్రి సమయంలో సమంత తో వీడియో కాల్ మాట్లాడుతూ కనిపించగా దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా విజయ్ ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫోటోస్ పంచుకున్నాడు.అందులో తను స్టైలిష్ లుక్ డిఫరెంట్ డ్రెస్ తో కనిపించాడు.

అయితే ఆ డ్రెస్ చూడటానికి చాలా డిఫరెంట్ గా ఉండగా నెటిజన్స్ ఆ డ్రెస్ చూసి బాగా ట్రోల్స్ చేస్తున్నారు.షర్ట్ తేడాగా ఉంది అంటూ ఒకరు కామెంట్ చేయగా.

అది షర్ట్ కాదు నైటీ అని మరొకరు కామెంట్ చేశారు.కొంతమంది మాత్రం దుప్పట కప్పుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి ఖుషి సినిమా ప్రారంభం నుండి విజయ్ మళ్ళీ బాగా ట్రోల్స్ ఎదురుకుంటున్నాడు.మరీ ఈ సినిమా విజయ్ కు ఎటువంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

ఇక త్వరలో మరో సినిమా సెట్స్ మీదికి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube