దక్షిణాది సిని ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాఘవ లారెన్స్ ( Raghava Larrence )ఒకరు.ఈయన ఇండస్ట్రీలో వివిధ రంగాలలో పనిచేస్తూ తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు.
ఇక కాంచన సిరీస్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న టువంటి లారెన్స్ త్వరలోనే చంద్రముఖి 2( Chandramukhi 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.రజనీకాంత్ నటించిన చంద్రముఖి సీక్వెల్ చిత్రంలో రజనీకాంత్ స్థానంలో లారెన్స్ నటిస్తున్నారు.
ఇక ఇందులో బాలీవుడ్ నటి కంగనా రౌనత్ చంద్రముఖి పాత్రలో నటిస్తున్నారు.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 19వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ విధంగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రపోషన్ కార్యక్రమాలలో భాగంగా చెన్నైలో ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు లారెన్స్ బౌన్సర్లకు మద్య గొడవ చోటుచేసుకుంది.దీంతో లారెన్స్ బాన్సర్లు విద్యార్థులపై చేయి చేసుకున్నారు.అందరికీ క్షమాపణలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా( Social media ) వేదికగా స్పందిస్తూ ఆడియో లాంచ్ కార్యక్రమంలో బౌన్సర్లకు స్టూడెంట్స్ కి మధ్య గొడవ జరిగిందనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది.నేను స్టూడెంట్స్ కి ఎలాంటి గౌరవం ఇస్తానో అందరికీ తెలిసిందే.స్టూడెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం.
అయితే బయట జరిగిన గొడవ గురించి నాకు ఇప్పుడే తెలిసిందని కారణం ఏదైనా స్టూడెంట్స్ పై అలా చేయి చేసుకోవడం తప్పు అంటూ ఈ సందర్భంగా తన బాన్సర్ల తరఫున అందరికీ లారెన్స్ క్షమాపణలు చెబుతున్నారు.ఇలాంటివి రిపీట్ కావని ఈయన తెలియచేశారు.
ఇలా లారెన్స్ విద్యార్థులందరికీ క్షమాపణలు చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.