గత మునుగోడు ఉప ఎనికల లో బారసా కి( BRS ) మద్దతు ఇవ్వడంతో కమ్యూనిస్టులు అధికార పార్టీతో కలిసి నడవటం ఖాయం అని చాలామంది అనుకున్నారు.అయితే అందరి అంచనాలకు భిన్నంగా బారాసా అదినేత వన్ సైడ్ గా అభ్యర్థులను ప్రకటించడంతో పొత్తు పేటాకులు అయినట్టుగా తెలిసిపోయింది.
పొత్తు ధర్మం పాటించలేదంటూ బారాసపై ఫైర్ అయిన కమ్యూనిస్టు పార్టీల నేతలు( Communist Parties ) భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ఇకపై ఉమ్మడిగా పోటీ చేస్తామంటూ ప్రకటించారు ఒంటరిగా పోటీ చేసి గెలుపొందే అంత బలం లేకపోయినప్పటికీ కొన్ని ప్రభావిత నియోజకవర్గాల్లో మాత్రం ఎదుటి పార్టీ అభ్యర్థిని ఓడించేంత శక్తి మాత్రం వామపక్షాలకు ఉంది.

సరిగ్గా ఈ పాయింట్‌ను ఆధారంగా చేసుకొని పొత్తుల కోసం కమ్యూనిస్టులు ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ.( Congress Party ) ముఖ్యంగా నల్గొండ, సూర్యపేట, కోదాడ, భద్రాచలం వంటి ప్రాంతాల్లో కమ్యూనిస్టులకు గట్టి పట్టు ఉంది .అధికార పార్టీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని పార్టీలతోనూ కలిసి ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు ఈ పరిణామం కలసి వచ్చి కమ్యూనిస్టులతో పొత్తు కోసం ప్రయత్నిస్తుంది .కొన్ని పరిమిత సంఖ్యలో సీట్లు ఆఫర్ చేసి పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తుంది అయితే కాంగ్రెస్ లో కూడా సీట్ల కోసం భారీ ఎత్తున పోటీ ఉన్నందున పొత్తు విజయవంతం అవ్వాలంటే కమ్యూనిస్టులను కొద్దిపాటి సీట్ల లో ఒప్పించాల్సి ఉంటుంది.

మరి కాంగ్రెస్ ఈ టాస్క్ ఏ విధంగా పూర్తి చేస్తుందో తెలియదు కానీ ఎర్రనల చేరిక మాత్రం కాంగ్రెస్ బలాన్ని పెంచుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.చాలా కాలంగా నలుగుతున్న షర్మిలా( YS Sharmila ) విషయం ఇంకా ఫైనల్ కాకపోయినప్పటికీ కమ్యూనిస్టుల విషయాన్ని మాత్రం రోజుల వ్యవధిలో తేల్చేయాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నాయకులకు డెడ్‌లైన్ విధించిందిఅని వార్తలు వస్తున్నాయి.మరి తెలంగాణ రాజకీయాల లో ఈ కొత్త స్నేహం ప్రభావం ఎంతో మరి కొద్ది రోజుల్లో ఒక అంచనా కు రావచ్చు
.






