గత కొన్ని రోజులుగా అధికార వైసిపి పాలనా వైఫల్యాలను పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ఇప్పుడు వైసీపీ ఇసుక పాలసీ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది.ఈ నాలుగేళ్ల వైసిపి హయాంలో 47 వేల కోట్ల రూపాయలు విలువైన అనేక వేల టన్నుల ఇసుక అన్యాక్రాంతం అయిందని ,ప్రభుత్వ ఖజానాకు చిల్లర విదిల్చి పెద్దమొత్తం ప్రభుత్వ పెద్దలు జేబుల్లో వేసుకుంటున్నారని టిడిపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఇసుక దోపిడీలో మింగిన ప్రతి రూపాయనీ కక్కిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా తెలుగుదేశం హయాంలో ఉచిత ఇసుక పాలసీకి( Free Sand Policy ) ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుకపాలసీ కి ఉన్న తేడాలను వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను కూడా ఇచ్చారు.

దీనిపై అధికార పార్టీ కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చింది.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ పేరుతో పోరుగు రాష్ట్రాలకు అమ్ముకున్నహీనమైన చరిత్ర తెలుగుదేశం నాయకులది అని లోకేష్ ఆధ్వర్యంలో( Nara Lokesh ) చెన్నై బెంగళూరు కు ఇసుక సరఫరా చేసి డబ్బులు మింగారని దీనికి ఎన్.జి.టి 100 కోట్ల రూపాయల ఫైన్ కూడా విధించిన విషయం అందరికీ తెలిసిందే అంటూ విమర్శించారు.అంతేకాకుండా ఉచితఇసుక పేరు చెప్పి తెలుగుదేశం నాయకులు దానిని మద్దతు ఇస్తున్న వ్యాపారవేత్తలు అనేక అక్రమాలకు పాల్పడ్డారు అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు.

2018- 19 సంవత్సరాలుగా కేవలం 1950 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే భూగర్భ గనుల శాఖకు వస్తే 2022 -23 సంవత్సరాలకి గాను 4756 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని అంతేకాకుండా ప్రభుత్వ సబ్ కమిటీ ద్వారానే ఇసుక పాలసీ తెచ్చామని టెండర్ల నియామకం కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎమ్.ఎస్ .టి.సి ద్వారానే జరిగిందంటూ ఆయన చెప్పుకోచ్చారు ఇలా అధికార ప్రతిపక్ష నేతల విమర్శలు ప్రతి విమర్శల మధ్య ఏపీ లో ఇసుక దుమారం హాట్ టాపిక్ గా మారినట్లుగా తెలుస్తుంది
.






