ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు గోస -బీజేపీ భరోసా బహిరంగ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపాలన్న అమిత్ షా కేంద్రంలోనూ మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.మోదీని మరోసారి ప్రధానిని చేయాలన్నారు.
తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయన్న అమిత్ షా కేసీఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని పేర్కొన్నారు.కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉందని విమర్శించారు.
ఉద్యమకారుల ఆకాంక్షలను సైతం కేసీఆర్ నీరు గార్చారని అమిత్ షా మండిపడ్డారు.







