తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ క్యూట్ కపుల్ మహేష్ బాబు, నమ్రతల( Mahesh babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో నమ్రత మహేష్ బాబుల జంట కూడా ఒకటి.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట చూడముచ్చటగా కనిపించడంతో పాటు ఎంతో అన్యోన్యంగా ఉంటారు.వారి మధ్య ఉన్న అన్యోన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పెళ్లయి ఇన్నేళ్లు అవుతున్నా కూడా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ అన్యోన్యత ఇంకా తగ్గలేదు.అంతేకాకుండా మహేష్ బాబు ,నమ్రతల కంటే ముందు ఆ తర్వాత పెళ్లి చేసుకున్న చాలామంది సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకొని విరిగిపోయిన విషయం తెలిసిందే.

ఇప్పటికీ ఈ జంట కలిసి ఉంటూ అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.అయితే సినిమా ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్న మహేష్ బాబు నమ్రతల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.అంతేకాకుండా కనీసం నెలకు ఒక్కసారైనా భార్యాభర్తలు తన పిల్లలతో కలిసి వెకేషన్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ జంటకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా( Social media )లో చెక్కర్లు కొడుతోంది.
సాధారణంగా సామాన్యులు సెలబ్రిటీలు ఎవరైనా సరే భార్యాభర్తలు గొడవ పడడం అన్నది సహజం ఆ తర్వాత కూల్ అయిపోతారు.అయితే మహేష్ బాబు నమ్రత పెళ్ళి అయ్యి ఇన్నేళ్లయిన ఒకే విషయం కారణంగా ఇప్పటికీ గొడవ పడుతూనే ఉంటారట.
అదే పిల్లల పెంపకం.

నమ్రత పిల్లల్ని( Namrata Shirodkar ) చాలా స్ట్రిక్ట్ గా పెంచాలి అనుకుంటూ ఉంటుంది.కానీ మహేష్ బాబు మాత్రం ఫ్రెండ్లీగా పెంచాలి అనుకుంటూ ఉంటారట.ఆ విషయం కారణంగానే వీళ్ళిద్దరూ తరచూ గొడవ పడుతూ ఉంటారట.
పిల్లలు అడిగింది అడిగినట్లు తీసి ఇవ్వకూడదు వాళ్ళకి దాని విలువ తెలీదు అనేది నమ్రత ఒపీనియన్ అయితే పిల్లలకి ఇష్టమైనవి తీసినప్పుడు ఇంకా వాళ్ళు ఎలా ఆనందపడతారు అనేది మహేష్ బాబు ఒపీనియన్.ఈ కారణంగా పిల్లల విషయంలో వీళ్ళు ఇప్పటికి గొడవ పడుతూనే ఉంటారట.







