హైదరాబాద్ లో డ్రగ్స్ మాయం కేసులో ఎస్ఐ అరెస్ట్..!

హైదరాబాద్ లో డ్రగ్స్ మాయం కేసులో ఎస్ఐ అరెస్ట్ అయ్యాడు.ఈ మేరకు రాయదుర్గం పోలీసులు ఎస్ఐ రాజేందర్ ను అదుపులోకి తీసుకున్నారు.

 Si Arrested In Drug Misappropriation Case In Hyderabad..!-TeluguStop.com

అయితే డ్రగ్స్ నిందితులను పట్టుకున్న టీమ్ లో సైబర్ క్రైం ఎస్ఐ రాజేందర్ ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను ఎస్ఐ రాజేందర్ కొంత మాయం చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

ఆ డ్రగ్స్ ను దాచిపెట్టి అమ్మాలని చూసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆరోపణలు నిజమని నిర్ధారించారు.దీంతో ఆయనను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా గతంలో రాయదుర్గంలో ఎస్ఐగా పనిచేసిన సమయంలోనూ రాజేందర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారని తెలుస్తోంది.కాగా రాజేందర్ సైబరాబాద్ సైబర్ క్రైంతో పాటు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube