లాక్మే( Lakme company ) పేరు అందరికీ తెలిసే ఉంటుంది.బ్యూటీ ప్రొడక్స్ వాడేవారికి దీని గురించి బాగా తెలిసి ఉంటుంది.
అందం కోసం కాస్మోటిక్స్ వాడేవారు ఎక్కువగా ఈ బ్రాండ్స్‌నే కొనుగోలు చేస్తారు.కాస్మోటిక్స్ రంగంలో ఈ కంపెనీ మంచి లాభాలతో దూసుకెళుతుంది.
శరీరానికి సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్‌ను ఈ కంపెనీ అందిస్తుంది.సౌందర్య సాధనాలు, అలంకరణలను ఈ కంపెనీ విక్రయిస్తుంది.
అయితే ఈ కంపెనీ వెనుక ఒక చరిత్ర ఉందట.
లాక్మే కంపెనీని స్థాపించడం వెనుక భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ( Jawaharlal Nehru ) పాత్ర ఉందట.భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే మహిళలు బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించేవారు.దీంతో కాస్మోటిక్స్ రంగంలో మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అవసరమని జవహర్లాల్ నెహ్రూ భావించారు.
దీంతో అప్పట్లో ప్రముఖ బిజినెస్‌మెన్‌గా ఉన్న జెఆర్‌డీ టాటాతో దాని గురించి చర్చించారు.జవహర్లాల్ సూచనతో 1952లో టాటా ఆయిల్ మిల్స్ అనుబంధ సంస్థంగా లాక్మేను జెఆర్‌డీ టాటా( J.R.D.Tata ) స్థాపించారు.
లాక్మే ప్రొడక్స్‌ను భారతీయులు వాడటం మొదలుపెట్టారు.దీంతో ఆ కంపెనీకి లాభాలు రావడంతో పాటు నెంబర్ వన్ కాస్మోటిక్స్ సంస్ధగా ఎదిగింది.భారతదేశంలో ప్రారంభించిన తొలి కాస్మోటిక్స్ కంపెనీ ఇదే కావడం విశేషం.
ఈ కంపెనీ రాకముందు విదేశీ ప్రొడక్స్‌ను భారతీయులు ఎక్కువగా వాడేవారు.దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందని జవహర్లాల్ నెహ్రూ భావించారు.
అయితే లాక్మే కంపెనీకి, లక్ష్మీదేవికి సంబంధం ఏంటంటే.లాక్మే అంటే ప్రెష్ భాషలో లక్ష్మీదేవి అని అర్థం.
పురాణాల్లో లక్ష్మీదేవిని అందానికి ప్రతీరూపంగా భావించేవారు.దీంతో లాక్మో అనే పేరును పెట్టారు.
ముంబైలోని ఒక చిన్న అద్దె రూమ్‌లో తొలుత ఈ కంపెనీని ప్రారంభించారు.ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ కంపెనీ ఇప్పుడు నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది.