రిషబ్ శెట్టి( Rishab Shetty ) ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన కాంతార సినిమా( Kantara ) ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కనీసం పది కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా కాంతార సినిమా ను రూపొందింది.దాదాపుగా రూ.350 కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో రికార్డు స్థాయి లో సీక్వెల్ పై అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం కాంతార 2 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
కాంతార సినిమా కథ కు సీక్వెల్ అన్నట్లుగా కాకుండా ప్రీ క్వెల్ గా సినిమా ను రూపొందించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కాంతార 2 సినిమా( Kantara 2 movie ) కథ చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.అంతే కాకుండా కాంతార 2 సినిమా కోసం ఏకంగా రెండు వందల కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారట.బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముక నటీ నటులు ఈ సినిమా లో కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి కాంతార 2 సినిమా ను ముందు నుండే ఒక కన్నడ సినిమా అన్నట్లుగా కాకుండా భారీ పాన్ ఇండియా మూవీ అన్నట్లుగా రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.కేజీఎఫ్ మేకర్స్ ఈ సినిమా ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్నారు.
ఇప్పటి వరకు కాంతార కథ గురించి ఎలాంటి అప్డేట్ లేదు.కానీ కన్నడ మీడియా తో పాటు జాతీయ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది.సినిమా గురించి ప్రస్తుతం కుప్పలు తెప్పలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అందులో ఏది నిజం అనేది తెలియాలి అంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.గతంతో పోల్చితే కన్నడ సినిమా పరిశ్రమ స్థాయి భారీగా పెరిగింది.అందుకే కాంతార 2 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
అందుకు తగ్గట్లుగానే మేకింగ్ చేపట్టినట్లుగా తెలుస్తోంది.