ఆస్ట్రేలియాకు( Australia ) చెందిన 40 ఏళ్ల ప్రియదర్శిని లింగరాజ్ పాటిల్( Priyadarshini Lingaraj Patil) అనే ఎన్నారై ఆస్ట్రేలియా ప్రభుత్వంతో పోరాడలేక చివరికి ప్రాణాలు విడిచింది.వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన ప్రియదర్శిని కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులు కనుగొన్న సూసైడ్ నోట్ ప్రకారం, ఆమె తన కుటుంబాన్ని వేధిస్తున్నందుకు ఆస్ట్రేలియా అధికారులు, సిడ్నీ ప్రాంతంలోని నివాసితులను నిందించింది.చైల్డ్ నెగ్లిసిన్స్ ఆరోపణల కారణంగా పాటిల్ కుటుంబం ఆమె పిల్లల సంరక్షణా హక్కును కోల్పోయింది.
చాలా రోజులుగా న్యాయపరమైన వివాదంలో చిక్కుకు పోయింది.
రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.ఎస్ దేశాయ్, శోభల( SS Desai, Sobhala ) కుమార్తె అయిన ప్రియదర్శిని తన పిల్లలను చికిత్స కోసం భారతదేశానికి తీసుకెళ్లనివ్వాలని ఆస్ట్రేలియా అధికారులను అభ్యర్థించింది, కానీ ఆమె విజ్ఞప్తులు అధికారులు పట్టించుకోలేదు.ఆమె కొడుకు అమర్త్య (17) ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడని ఆమె చెబుతూ వారిని ఇండియాకి తీసుకురావాలని ప్లాన్ చేసింది కానీ అది సాధ్యం కాలేదు.
ఆమె కొడుకుతోపాటు కూతురు అపరాజిత ఇద్దరూ పుట్టినప్పుడే ఆస్ట్రేలియన్ పౌరసత్వాన్ని పొందారు.కుమారుడికి జబ్బు చేసిందని ప్రియదర్శిని మొదట ఆస్ట్రేలియాలో చికిత్స చేయించింది.అయితే చికిత్స తర్వాత కుమారుడి ఆరోగ్యం మరింత క్షీణించింది.
దాంతో ప్రియదర్శిని డాక్టర్ పై కంప్లైంట్ చేసింది.అయితే ప్రభుత్వం డాక్టర్ పై చర్యలు తీసుకోవడానికి బదులుగా ప్రియదర్శినిని నిందించింది.పిల్లలను సరిగా చూసుకోవడం లేదని, అందుకే అమర్త్య జబ్బునపడ్డాడని వ్యాఖ్యానించింది.
అంతేకాదు పిల్లల సంరక్షణను ప్రభుత్వమే తీసుకుంది.దీంతో ఏం చేయాలో పాలు పోని ప్రియదర్శిని కనీసం వారి పౌరసత్వాన్ని రద్దుచేసి ఇండియాకి తిరిగి తీసుకెళ్దామని అనుకుంది.
అందుకు కూడా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు.వీటన్నిటి వల్ల మనస్థాపానికి గురైన సదరు తల్లి ఇండియాకు వచ్చి మలప్రభ నది, నవిలుతీర్థ డ్యామ్ సమీపంలో నదిలోకి దూకింది.
ఆమె ఆరోగ్యం క్షీణించడం, వేధింపులు ఆమెను ఈ తీవ్రమైన చర్యకు దారితీసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.తమ ప్రాణాలకు బెదిరింపులు ఉన్నాయని, సిడ్నీలోని వెర్లీ స్ట్రీట్ నివాసితులు వేధిస్తున్నారని సూసైడ్ నోట్‌లో ఆమె పేర్కొంది.
పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.