రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని గడప గడపకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకువెళ్లాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన నమిలికొండ శ్రీకాంత్ బిజెపి సీనియర్ నాయకులు శుక్రవారం కరీంనగర్ లోని బండి సంజయ్ నివాసానికి వెళ్లి
మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చమిచ్చి శాలువతో సత్కారం చేశాడు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలో కాషాయ జెండాను ఇంటింటికి చేరవేయాలని పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని రానున్న ఎన్నికలలో బిజెపి పార్టీ నుండి టికెట్ పొందిన అభ్యర్థి గెలుపుకు దోహదపడాలని సూచించారన్నారు.