ప్రముఖ బ్రాండెడ్ దిగ్గజం యాపిల్ బ్రాండ్లు( Apple brands ) గురించి జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.ఈ కంపెనీనుండి ఎన్నో రకాల వస్తువులు మార్కెట్లోకి వస్తున్నాయి.
వీటిలో ఐఫోన్స్‌తో పాటు ఎయిర్‌పాడ్స్‌కు( AirPods ) ఎంత మంచి డిమాండ్ వుందో అందరికీ తెలిసినదే.ఈ మధ్య కాలంలో యూత్ ఎక్కువగా వీటికి అట్రాక్ట్ అవుతున్నారు.
పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా యాపిల్ ఇప్పటికే ఎయిర్‌పాడ్స్ ప్రో బడ్స్ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో అత్యంత ప్రజాదరణ పొందాయి.
ఇక త్వరలోనే యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు న్యూ ఎయిర్‌పాడ్స్ ప్రోను యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఫీచర్‌తో లాంచ్ చేయనుంది.
ఈ నేపథ్యంలో ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్( E-commerce company Flipkart ), పాత తరం యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోపై భారీ ఆఫర్ ను ప్రకటించింది.రూ .27వేల ప్రొడక్ట్‌ను ఇప్పుడు కేవలం వెయ్యి రూపాయలకే అందిస్తోంది.అవును, మీరు విన్నది నిజమే.అయితే అదెలాగో ఇపుడు తెలుసుకోండి.దీని ఫీచర్ల విషయానికొస్తే చాలా టెంప్టింగ్ గా వున్నాయి.స్మాల్ స్టెమ్‌తో కూడిన సిలికాన్ టిప్స్‌తో దీనిని డిజైన్ చేయడం జరిగింది.
అందుకే వీటిని ఎక్కువ మంది యూజ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.ఇవి స్వెట్(చెమట), ప్లస్ అడాప్టివ్ ట్రాన్స్‌ఫరెన్సీ, వాటర్ రెసిస్టెంట్ ప్రొడక్ట్.2x వరకు మోర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇమ్మర్సివ్ సౌండ్ కోసం డైనమిక్ హెడ్ ట్రాకింగ్‌తో పర్సనలైజ్డ్ స్పేషియల్ ఆడియో వంటి స్పెషల్ ఫీచర్స్ దీని ప్రత్యేకతలు.
ఇకపోతే ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ మాగ్ సేఫ్ ఛార్జింగ్ కేస్‌తో 24 గంటల కంటే ఎక్కువ బేకప్ ని కలిగి ఉంటాయి.ఇవి ట్రాన్స్‌ఫరెన్స్ మోడ్‌తో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఈ ఆఫర్ వివరాలను చూస్తే.యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో రూ.26,900 ధరతో లాంచ్ అయినప్పటికీ వీటిపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్ ప్రకటించింది.ఏకంగా రూ.22,000 పైగా డిస్కౌంట్‌తో ఈ ఇయర్‌బడ్స్‌ను సొంతం చేసుకోవచ్చు.ఎలాగంటే రూ.3,910 ప్రారంభ డిస్కౌంట్, ఎక్చేంజ్ చేసుకుంటే ఎయిర్‌పాండ్స్ ప్రో పై అదనంగా రూ.21,900 డిస్కౌంట్ లభిస్తుంది.అంటే చివరగా రూ.1090 లకే సొంతం చేసుకోవచ్చు.