యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి ( Mallidi Vassishta )తన టాలెంట్ ను బింబిసార సినిమా( Bimbisara )తోనే నిరూపించు కున్నాడు.కళ్యాణ్ రామ్ తో మొదటి సినిమానే పీరియాడిక్ బ్రేక్ డ్రాప్ లో తెరకెక్కించి సాహసం చేసారు.
ఇతడు ఈ రేంజ్ లో హిట్ అందుకుంటాడు అని ఎవ్వరు ఊహించలేదు.ఇక ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వసిష్ఠ మెగాస్టార్ తో కూడా సినిమా చేస్తాడు అనే టాక్ గతంలో బలంగా వినిపించింది.
ఈ వార్తలను నిజం చేస్తూ ఇన్నాళ్లకు అఫిషియల్ అప్డేట్ ఇచ్చారు.ఈ యంగ్ డైరెక్టర్ కు మెగాస్టార్ పిలిచి మరీ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది.‘మెగా157’ అంటూ ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయగా మెగా ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం వెల్లువిరిసింది.యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించ నున్నారు.
ఈ రోజు అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
ఈసారి చిరు( Chiranjeevi 0 రీమేక్స్ తో కాకుండా స్ట్రైట్ సినిమాలతోనే వస్తున్నట్టు తెలుస్తుంది.
పంచభూతాల కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు.మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఈ సినిమా అనౌన్స్ మెంట్ చేసారు.ఇక ఈ సినిమా విషయంలో ఈ యంగ్ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్ చేసారు…
నన్ను నమ్మి మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పై ప్రజెంట్ చేసే అవకాశం కల్పించిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.బాస్ ఆఫ్ మాసెస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఈయన చెప్పుకొచ్చాడు.మరి ఈ ప్రాజెక్ట్ ను ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి.ఇక చిరు నటించనున్న 156వ ప్రాజెక్ట్ ను మెగాస్టార్ కూతురు తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.