మన భారతదేశంలో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల విషయానికి వస్తే మొట్టమొదట గుర్తు వచ్చేది మారుతి సుజుకీ.( Maruti Suzuki ) రూ.5 లక్షల బడ్జెట్లో బెస్ట్ ఫీచర్లతో భారత మార్కెట్లో అందుబాటులో ఉండే కార్ల వివరాలు ఏమిటో పూర్తిగా చూద్దాం.
మారుతి సుజుకీ ఆల్టో కే10:
ఈ కారు( Maruti Alto K10 ) 998సీసీ పెట్రోల్ ఇంజన్ తో ఉంటుంది.67బీ హెచ్ పీ, 90ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.సీఎన్జీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.సీఎన్జీ వెర్షన్ లో 32.26 కిలో మీటర్/ కేజి మైలేజ్ ఇస్తుంది.ఇందులో మ్యానువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.ఫ్యూయల్ ట్యాంక్ 35 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది.పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, రియల్ పార్కింగ్ సెన్సార్స్, సెంట్రల్ లాకింగ్ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి.ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల మధ్య ఉంటుంది.

మారుతి సుజుకీ ఆల్టో 800:
ఈ కారు( Maruti Alto 800 ) 796సీసీ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది.47 బీ హెచ్ పీ, 69ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.ఈ కారు సీఎన్జీ వెర్షన్ లో అందుబాటులో ఉంది.ఫీచర్ల విషయానికి వస్తే పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ తో కూడిన ఈబీడి, పార్కింగ్ సెన్సార్, సెంట్రల్ లాకింగ్ సిస్టం, 177 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంది.ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.3.54 లక్షల నుంచి రూ.5.13 లక్షల మధ్య ఉంది.

మారుతి సుజుకీ ఎస్ ప్రెసో:
ఈ కారు( Maruti Suzuki S Presso ) 998సీసీ పెట్రోల్ ఇంజన్ తో ఉంటుంది.67బీ హెచ్ పీ, 90ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.ఈ కారు మ్యానువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లు కలిగి ఉంది.స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, టచ్ స్క్రీన్, ఇన్ ఫో టైన్ మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, రియల్ పార్కింగ్ సెన్సార్, సెంట్రల్ లాకింగ్ సిస్టం వంటి ఫీచర్లతో ఉంటుంది.270 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.11 లక్షల మధ్య ఉంటుంది.







