జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య తన అనుచరుల వద్ద కంటతడి పెట్టుకున్నారు.అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే రాజయ్య కన్నీటి పర్యంతమైయ్యారని తెలుస్తోంది.
రానున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ జాబితాలో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంపై రాజయ్య బోరున విలపించారని తెలుస్తోంది.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన తనకు ఈసారి టికెట్ కేటాయించకపోవడంపై ఆయన బాధపడ్డారని సమాచారం.స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి రాజయ్య 2014, 2018లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే.
అయితే ఈ సారి టికెట్ ను కడియం శ్రీహరికి ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.







