హైదరాబాద్ మీర్ పేటలోని నందనవనంలో లైంగిక వేధింపులకు గురైన బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ విపక్ష పార్టీలు ఆందోళన కార్యక్రమం నిర్వహించాయి.ఈ మేరకు మీర్ పేట రహదారిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు బైటాయించి నిరసనకు దిగారు.
ఈ క్రమంలోనే లైంగిక దాడికి పాల్పడ్డ గ్యాంగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటివరకు ఘటనపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు నిరసన చేస్తున్న విపక్ష పార్టీల నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.







