వాట్సాప్ యూజర్ల( Whatsapp )కు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.వాట్సాప్‌లో ఫోటోలు, మీడియా టైటిల్స్ ఎడిట్ చేసుకునే సౌలభ్యం ఉంది.
ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే వచ్చిన ఎడిట్ ఆప్షన్ తరహాలోనే ఉంటుంది.యూజర్లు మెసేజ్ పంపిన 15 నిమిషాల్లోనే అక్షరదోషాలను సరిచేయడానికి అనుమతిస్తుంది.
ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి, వినియోగదారులు అప్‌డేట్ చేసిన యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్ టాప్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంది.
మనం పంపే ఫొటోలు, వీడియో శీర్షికను సవరించడానికి, దానిని నొక్కి పట్టుకోవాలి.దీని తర్వాత, డ్రాప్ డౌన్ మెను నుండి, వినియోగదారులు పంపిన ఫొటోలు, వీడియోల హెడ్డింగ్స్ సవరించడానికి ఎంచుకోవచ్చు.
ఈ ఫీచర్‌లో, మీరు ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లతో పాటు జీఐఎఫ్ ఫైల్‌ల క్యాప్షన్‌లను సవరించవచ్చు.అయితే, వినియోగదారులు మొదటి 15 నిమిషాల వరకు మాత్రమే శీర్షికలను సవరించగలరు.

తాజాగా వాట్సాప్ హెచ్‌డీ ఫొటోలను ( HD photos )షేర్ చేసుకునే ఫీచర్‌ను విడుదల చేసింది.ఈ ఫీచర్ సహాయంతో హై క్వాలిటీ ఫోటోలను పంపడం సులభం అయింది.ఇప్పుడు మీరు ఎవరికైనా ఫోటోను పంపినప్పుడు, మీరు ఫోటో నాణ్యతను ఎంచుకునే ఎంపికను కూడా పొందుతారు.అంతకుముందు అది లేదు.డిఫాల్ట్‌గా వాట్సాప్‌లో షేర్ చేయబడిన ఫోటోలు ఎస్‌డీలో ఉంటాయి.కానీ మీరు పంపే ముందు దాని నాణ్యతను హెచ్‌డీకి మార్చవచ్చు.

చాట్ బాక్స్‌లో, మీరు ఇప్పుడు పైన హెచ్‌డీ బటన్‌ను చూడొచ్చు.అక్కడ నుండి మీరు ఫోటో నాణ్యతను మార్చవచ్చు.వాట్సాప్‌లో హెచ్‌డీ వీడియో ఫీచర్ త్వరలో రాబోతోంది.కొన్ని నెలల విస్తృతమైన బీటా టెస్టింగ్ తర్వాత, వాట్సాప్ తన గ్లోబల్ యూజర్ బేస్ కోసం అధికారికంగా స్క్రీన్ షేర్ ఫీచర్‌ను విడుదల చేసింది.
ఈ ఫీచర్ వీడియో కాల్( Video Call ) సమయంలో వినియోగదారులు తమ ఫోన్ లేదా పీసీ స్క్రీన్‌ని ఇతరులకు షేర్ చేయడానికి అనుమతిస్తుంది.యూజర్ల గోప్యతను నిర్ధారించడానికి వాట్సాప్ అనేక భద్రతా ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది.
వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు.దాని యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి, వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటోంది.







