సినిమా ఇండస్ట్రీ అంటే అందరు ఇక్కడ ఉండేవాళ్ళ అందరి లైఫ్ లు చాలా సాఫీగా సాగుతూ ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఎవరి కష్టం వాళ్లకి ఉంటుంది అదీ బయట చూసే వాళ్ళకి కనిపించదు.అయితే హీరోయిన్స్ కి మాత్రం ఇక్కడ చాలా కష్టం అనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ చాలా మందికి హీరో యిన్ గా అవకాశాలు ఇస్తాం అంటూ మోసం చేస్తూఉంటారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలీదు అలాంటి ఒక దిన స్థితి నుంచి వచ్చి ఇక్కడ హీరోయిన్లు గా ఎదిగిన తెలుగు హీరోయిన్స్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి తెలుసుకుందాం…

నిజానికి తెలుగు లో నుంచి ఇప్పుడు ఎక్కువ మంది హీరోయిన్స్ రావడం లేదు అని అంటూ ఉంటారు కానీ ఒకప్పుడు రోజా( Roja ) ఎవ్వరి సపోర్ట్ లేకుండా సోలో గా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా వచ్చి ఇక్కడున్న టాప్ హీరోలందరితో నటించి మరి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.అలాగే మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య లాంటి హీరోల తో కూడా చాలా సినిమాల్లో నటించింది.ఇక ప్రస్తుతం రోజా వైసీపీ పార్టీ( YCP ) నుంచి ఎమ్మెల్యే గా గెలిచి మినిష్టర్ కూడా అయింది…

ఇక ఈమె తో పాటు గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరో యిన్ ఎవరంటే రంభ( Rambha ) ఈమె చేసిన సినిమాల్లో అన్ని సినిమాలు అప్పట్లో మంచి విజయాలు అందుకున్నాయి నిజానికి ఈమె ఒక సూపర్ టాలెంట్ ఉన్న నటి కావడం తో ఈమె కి అప్పట్లో మంచి విజయాలు దక్కేవి…ఈమె కూడా ఇండస్ట్రీ లో ఉన్న అందరు పెద్ద హీరోలతో నటించి మెప్పించిందనే చెప్పాలి ముఖ్యంగా చిరంజీవి తో హిట్లర్, బావగారు బాగున్నారా( Hitler )సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది.ఇక అప్పట్లో చిరంజీవి తో పాటు పోటీ పడి మరి ఈమె డాన్స్ చేసేది…








