ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలందరూ వరుసగా ఒక్కొక్కరు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి హీరోలందరూ కూడా పెళ్లిళ్లు చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడగా హీరోయిన్లు సైతం వారు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలో స్థిరపడుతున్నారు.
ఇకపోతే నటి నిత్యామీనన్( Nitya Menon ) గురించి ఆమె పెళ్లి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియా( Social media )లో వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.నిత్యామీనన్ త్వరలోనే పెళ్లి( Marriage ) చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి.

ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో నిత్యామీనన్ గతంలో ఈ పెళ్లి వార్తలపై స్పందిస్తూ తాను పెళ్లి చేసుకుంటున్నాను అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదు అంటూ కొట్టి పారేశారు.అయితే తాజాగా మరోసారి ఈ వార్త వైరల్ అవుతుంది.మలయాళ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి కొందరు సెలబ్రిటీలు సైతం నిత్యమీనన్ పెళ్లి గురించి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.ఈమె తన చిన్ననాటి స్నేహితులు మలయాళ హీరోని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇలా నిత్యమీనన్ పెళ్లి గురించి వచ్చే వార్తలు నిజమేనని మలయాళ చిత్ర పరిశ్రమలో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.ఈసారి నిత్యామీనన్ నిజంగానే పెళ్లి చేసుకోబోతుందని త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలబడబోతుందని తెలుస్తుంది.మరి నిత్యమీనన్ పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.ఇక నిత్యామీనన్ కెరియర్ విషయానికి వస్తే ఈమె కెరియర్ పరంగా పలు సినిమాలలోను వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.







