ఇంటర్నెట్ అనేది ప్రపంచాన్ని రాజ్యమేలుతున్నవేళ ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ అనేవి కొలువు దీరాయి.ఇంకేముంది సహజంగానే సోషల్ మీడియాకి క్రేజ్ పెరిగింది.
ఈ క్రమంలో మనుషులు సోషల్ మీడియాకు( Social Media ) బాగా అలవాటు పడటం కాదు కదా… బానిసలుగా మారిపోయిన పరిస్థితి.ఆ విషయం కాస్త పక్కన బెడితే సోషల్ మీడియా చూసేవారి సంఖ్య బాగా పెరిగి పోయింది కాబట్టి వైరల్ వీడియోల హవా ఎక్కువైంది.
ఈ క్రమంలో అనేక వీడియోలు దర్శనం ఇస్తున్నాయి.ఈ క్రమంలోనే ఆంబోతుల మధ్య గొడవను( Bulls Fight ) ఆపేందుకు ప్రయత్నించిన ఓ ఆటో డ్రైవర్ పరిస్థితికి సంబందించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

వీడియోని ఒకసారి గమనిస్తే 2 ఆంబోతులు నడివీధిలో పోరాడుతూ ఉంటాయి.అసలే అది ఇరుకైన వీధి, దీనికి తోడు భారీగా కనిపిస్తున్న ఆంబోతులు బీభత్సంగా తలపడుతూ ఉంటాయి.దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతారు.ఎవరైనా అకారణంగా ప్రమాదంలో చిక్కుకుంటారేమో అని ఆ దృశ్యం చూసినవారు వణికిపోతూ వుంటారు.ఎంతమంది కలిసి వాటిని బెదిరించినా కూడా రెండు ఆంబోతులూ ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితి కనబడదు.ఒకదానిపై మరొకటి కొమ్ములు విసురుతూ నానా బీభత్సం సృష్టించాయి.
సరిగ్గా ఇలాంటి టైంలో ఓ ఆటో డ్రైవర్( Auto Driver ) రంగంలోకి దిగాడు.

వాటిని తోలేసేందుకు ఓ ప్లాన్ వేశాడు.ఇందులో భాగంగా తన ఆటోను వెనక్కు నడిపిస్తూ ఆ రెండు ఆంబోతులను ఓకేసారి ఢీకొట్టాడు.ఆ దెబ్బకు దిమ్మెరపోయిన రెండూ కాస్త వెనక్కు తగ్గినట్టే తగ్గీ ఆటోను కొమ్ములతో ఎత్తి విసిరి పడేస్తాయి.
అయితే, అదృష్టవశాత్తూ ఆటో డ్రైవర్‌కు ఏమీ కాదు కానీ, ఆటో మాత్రం తుక్కు తుక్కు అవుతుంది.నెట్టింట్లో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఎందుకంటే ఆటో డ్రైవర్ అంతటి రిస్క్ తీసుకుకొని మరీ వాటిని విడిపించినందుకు అనేకమంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.మరి నెట్టింట ఇంతలా వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.







