తెలంగాణలో ఎలక్షన్స్ ( Elections in Telangana )దగ్గర పడడంతో అందరి కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఒక్కసారిగా ఎన్నికల వేడిని రాజేసింది అధికార బిఆర్‌ఎస్ పార్టీ.119 స్థానాలకు గాను 115 స్థానాల్లో మొదటి జాబితా అభ్యర్థులుగా ప్రకటించి అందరి దృష్టి బిఆర్‌ఎస్ పై పడేలా చేశారు గులాబీ బాస్;.కాగా ప్రకటించిన మొదటి జాబితాలో దాదాపు సిట్టింగ్ లకే ఎక్కువ ప్రదాన్యం కల్పించిన కేసిఆర్ ఒక ఏడు స్థానాల విషయంలో మాత్రం కొత్తవారికి అవకాశం ఇచ్చారు.అయితే మొదటి నుంచి సీటు తమకే వస్తుందని కాన్ఫిడెంట్ వ్యక్తం చేసిన ఓ నాలుగు సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం అధినేత మొండి చేయి చూపించారు.

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య( Tatikonda Rajaiah ) సీటు కోసం యాగాలు చేసిన సంగతి విధితమే.అయినప్పటికి ఆ యాగలేవీ ఫలించలేదు.ఆయన స్థానంలో కడియం శ్రీహరికి( Kadiam Srihari ) టికెట్ ఇచ్చారు కేసిఆర్.ఇక ఉప్పల్ ఎమ్మెల్యే బేతి శుభాష్ స్థానంలో బండారు లక్ష్మారెడ్డికి, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ప్లేస్ లో మదన్ లాల్ వంటివారికి అవకాశం ఇచ్చారు అధినేత కేసిఆర్.
ఇక మొదటి నుంచి కూడా ఆసిఫాబాద్ టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మరియు కోవా లక్ష్మిమద్య గట్టి పోటీ ఉండింది.అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కు ను పక్కన పెట్టి కోవా లక్ష్మికే ఆసిఫాబాద్ టికెట్ కట్టబెట్టారు.
దీంతో ఈసారి టికెట్ లభించిన సిట్టింగ్ ఎమ్మెల్యేల నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.

వారు పార్టీ మారతారా లేదా బిఆర్‌ఎస్( brs ) నే అంటిపెట్టుకొని ఉంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.ఆత్రం సక్కు, తాటికొండ రాజయ్య వంటివారు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట.ఆత్రం సక్కు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండగా 2018 లో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత బిఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు మళ్ళీ ఇప్పుడు సీట్ దక్కకపోవడంతో ఆయన సొంత గూటికి చేరేందుకు మార్గం వెతుక్కుంటూయిన్నారట, అటు తాటికొండ రాజయ్య బీజేపీ పార్టీతో టచ్ లోకి వెళ్ళినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాగా పార్టీ లో ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పని కేసిఆర్ ఇప్పటికే హెచ్చరించారు.ఈ నేపథ్యంలో సీటు దక్కని వారు ఇతర పార్టీల్లోకి వెళ్ళేందుకు సిద్దమౌతారా లేదా అనేది చూడాలి.







