మెహర్ రమేష్ తీసిన ఈ రెండు సూపర్ హిట్ సినిమాల గురించి మీకు తెలుసా ?

మెహర్ రమేష్( Meher Ramesh ) తాను డైరెక్ట్ చేసిన ప్రతి హీరోకి తమ కెరీర్లోనే అతి పెద్ద డిసాస్టర్ ని గిఫ్టుగా ఇచ్చాడన్న ఒక చెత్త రికార్డు ఉంది.పాపం ఈ డైరెక్టర్ గత 10 ఏళ్లుగా ఒక సాలిడ్ హిట్ కొట్టేందుకు తెగ కష్టపడుతున్నాడు.

 Do You Know About These Hit Movies Of Mehar Ramesh, Mehar Ramesh, Mehar Ramesh M-TeluguStop.com

కానీ విజయం మాత్రం ఆయన చెంత చేరడం లేదు.అదే ఆశతో తాజాగా మెగా స్టార్ చిరంజీవితో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునే ప్రయత్నం చేసాడు మెహర్ రమేష్.

మెహర్ రమేష్, చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రం “భోళాశంకర్”( Bhola Shankar ).తమిళ్ లో అజిత్ హీరోగా తెరకెక్కిన “వేదాళం” రీమేక్ ఈ చిత్రం.ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అవుతుందనే అంచనాలు ప్రేక్షకులలో పెద్దగా లేకపోయినప్పటికీ చిరంజీవి కెరీర్ లోనే అతి పెద్ద డిసాస్టర్ గా నిలుస్తుందని మాత్రం ఎవ్వరు ఊహించివుండరు.ఈ చిత్రం అభిమానులను బాగా డిసప్పోఇంట్ చేసింది.

Telugu Bhola Shankar, Chiranjeevi, Mehar Ramesh-Movie

మహేష్ బాబు నటించిన బాబీ సినిమాతో యాక్టరుగా పరిశ్రమలో అడుగుపెట్టిన మెహర్ రమేష్ తరువాత డైరెక్టర్ గా మారాడు.తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఐదు సినిమాలలో కేవలం “బిల్లా” చిత్రం మాత్రమే యావరేజ్ టాక్ సంపాదించింది.మిగిలిన నాలుగు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి.ఐతే ప్లాప్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గ మారిన మెహర్ రమేష్ తనడిరెక్షన్ కెరీర్ ని మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ తోనే మొదలుపెట్టాడు.

మెహర్ రమేష్ తెలుగులో దర్శకత్వం వహించిన మొదటి సినిమా కంత్రి.కానీ ఈ చిత్రానికి ముందు ఆయన కన్నడలో రెండు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Mehar Ramesh-Movie

మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం “వీర కన్నడిగ”.ఈ చిత్రం పూరి జగన్నాథ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన “ఆంధ్రావాలా” చిత్రం కన్నడ రీమేక్.ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించారు.ఈ సినిమా కన్నడలో బ్లాక్బస్టర్ అయ్యింది.మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన రెండొవ చిత్రం “అజయ్”.ఇది తెలుగులో సూపర్ హిట్ అయిన “ఒక్కడు” సినిమా రీమేక్.

ఈ చిత్రం కూడా కన్నడలో సూపర్ హిట్ అయ్యింది.ఇలా కన్నడలో రెండు బ్యాక్ తో బ్యాక్ బ్లాక్బస్టర్ హిట్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ తెలుగులో మాత్రం డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube