కాంగ్రెస్ పార్టీకి ( Congress party )సంబంధించినంతవరకు సిడబ్ల్యూసీ కమిటీ( CWC Committee ) అన్నది అత్యంత కీలకమైన కమిటీగా చెప్పుకోవచ్చు.ఎన్నికలలో అనుసరించాల్సిన కీలక వ్యూహాల దగ్గర నుంచి ప్రచార కార్యక్రమాలు సభా సంఘాల నిర్వహణ,ఎలక్షన్ కమిటీల నిర్వహణ వరకు పూర్తిస్థాయి బాధ్యతలను సిడబ్ల్యుసి నిర్వర్తిస్తుంది .
అలాంటి కీలకమైన కమిటీలో ఆంధ్రా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి ( Raghuveera Reddy )చోటు దగ్గటం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది .వైయస్ మరణం తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సోదిలో కూడా లేకుండా పోయింది.ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆ పార్టీ భూస్థాపితం అయిపోయింది.దాంతో కాంగ్రెస్ భవిష్యత్తుపై ఆశలుడిగిన చాలామంది కీలక నేతలు రాజకీయంగా తెరమరుగైపోయారు అందులో రఘువీరారెడ్డి ఒకరు ఆయన ఒక మామూలు వ్యవసాయదారుడుగా ట్రాక్టర్ నడుపుతున్న ఫోటోలు ఆమధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి దానితో ఆయన పూర్తిస్థాయిలో రాజకీయ రంగం నుంచి విరమించుకున్నారని ప్రశాంత జీవితం గడుపుతున్నారంటూ వార్తలు వచ్చాయి .

అయితే ఇటీవల జరిగిన కన్నడ ఎన్నికలలో మళ్ళీ ప్రత్యక్షమైన రఘువీరా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు.దానితో ఆయన రాజకీయంగా మరొకసారి యాక్టివేట్ అవుతున్నారన్న అంచనాలు వినిపించాయి .దానికి తగ్గట్టుగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కమిటీలో ఆయన పేరు ప్రత్యక్షమైంది.రెండు తెలుగు రాష్ట్రాలకి ఆయన ఒక్కరి పేరే ఉండడం విశేషం, అయితే దీని వెనక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Congress president Mallikarjuna Kharge ) ఉన్నట్టుగా తెలుస్తుంది .కర్ణాటకకు చెందిన ఖర్గే రఘువీరారెడ్డి అత్యంత సన్నిహితుడని ,కన్నడ కర్ణాటక ఎన్నికలలో యాక్టివ్గా పనిచేస్తున్నందుకు ఇది రఘువీరా కి ఇచ్చిన నజరానాగా చెప్పవచ్చు.తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కాంగ్రెస్ దృష్టి పెడుతుందని వస్తున్న వ్యాఖ్యలకు తగ్గట్టుగా ఈ నియామకం జరిగినట్టుగా తెలుస్తుంది.
కాంగ్రెస్ని వీడి వివిధ పార్టీలలో సెటిలైపోయిన పాత కాపులందరినీ తిరిగి యాక్టివేట్ చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ హైకేమైనా ఉన్నట్లుగా తెలుస్తుంది.వీరందరితోను మంచి సంబంధాలు ఉన్న రఘువీరాకు ఈ బాధ్యతలు అప్పజెప్పడం ద్వారా తిరిగి కాంగ్రెస్కు పునర్ వైభవం ఆంధ్ర ప్రదేశ్ లో తీసుకురావాలని కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తుంది.
మరి సమీకరణలు అనుకూలిస్తే మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘువీరా రెడ్డి ని చూడవచ్చేమో
.






