చాలా మంది ప్రపంచంలో కటిక పేదరికంలో( Poverty ) మగ్గి పోతున్నారు.కనీస వైద్య సదుపాయాలకు నోచక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ పరిస్థితి అభివృద్ధి చెందుతున్న దేశాలలో నేటికీ అధిక స్థాయిలో కనిపిస్తోంది.ముఖ్యంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న, ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో( China ) ఇటీవల షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఓ మహిళ 31 ఏళ్ల వయసులో గర్భం దాల్చి, 92 ఏళ్ల వయసులో ప్రసవించింది.అంటే తాను 60 ఏళ్లకు పైగా తన కడుపులో పిండాన్ని( Fetus ) మోసింది.
శిశువు చనిపోయినా అలాగే చాలా ఏళ్ల పాటు తన కడుపులో బిడ్డను మోసింది.

అబార్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచించినా అందుకు తగిన డబ్బులు లేక అన్నేళ్ల పాటు బాధను అనుభవించింది.చివరికి వైద్యులకు విషయం చెప్పి 60 ఏళ్ల తర్వాత ఆమె అబార్షన్ చేయించుకుంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
హువాంగ్ యిజున్( Huang Yijun ) అనే మహిళ చైనాలో ఒక పేద ఇంట్లో పుట్టింది.ఆమెకు 31 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె గర్భం దాల్చింది.
అయితే వైద్యుల వద్దకు పరీక్షల నిమిత్తం వెళ్లినప్పుడు వారు షాకింగ్ విషయం ఆమెకు చెప్పారు.కడుపులో ఉన్న పిండం గర్భసంచిలో కాకుండా బయట పెరుగుతోందని, అబార్షన్ చేయించుకోవాలని సూచించారు.

అయితే అబార్షన్( Abortion ) చేయించుకునేందుకు ఆమె వద్ద డబ్బులు లేవు.దీంతో ఏది అయితే అదే అవుతుందని మొండి ధైర్యంతో ఇంటికి వచ్చేసింది.ఆశ్చర్యకరంగా ఆమెకు ఎలాంటి అస్వస్థత తలెత్తలేదు.ఎలాంటి బ్లీడింగ్ కలగలేదు.అలాగే కడుపులో పిండాన్ని 60 ఏళ్లకు పైగా మోసింది.చివరికి 92 ఏళ్ల వయసులో వైద్యులను సంప్రదించినప్పుడు వారు ఆశ్చర్యపోయారు.
కడుపులో పిండం స్టోన్ బేబీ (లిథోపెడియన్)గా మారిపోయిందని వైద్యులు వెల్లడించారు.శస్త్రచికిత్స చేసి స్టోన్ బేబీని( Stone Baby ) బయటకు తీశారు.
ట్విట్టర్ ద్వారా ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.పేదరికంలో ఉన్న ఆమె పరిస్థితి తెలుసుకుని నెటిజన్లు చలించిపోతున్నారు.







