నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మహేశ్వర్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు డీకే అరుణ బయలుదేరారు.ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేశారు.అయితే మహేశ్వర్ రెడ్డికి మద్ధతు తెలిపేందుకు తాను ఒక్కదాన్నే వెళ్తానన్న పోలీసులు అనుమతించలేదని చెబుతున్నారని తెలుస్తోంది.







