Kiran Abbavaram : సోషల్ మీడియాలో అలాంటి ఫోటో షేర్ చేసిన కిరణ్ అబ్బవరం.. హీరోలా ఉన్నావంటూ ట్రోల్స్?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట 2019లో విడుదల అయిన రాజా వారు రాణి గారు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

 Trolls On Hero Kiran Abbavaram Photo-TeluguStop.com

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఆ తర్వాత 2021 లో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

ఆ తరువాత వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, సమ్మతమే( Sammathame ) లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.అయితే కిరణ్ కి పెద్ద సంస్థల్లో ఆఫర్లు వచ్చినా సక్సెస్ మాత్రం రావడం లేదు.అయితే కిరణ్ అబ్బవరాన్ని తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్( Social Media Trolls ) చేస్తుంటారని అప్పుడప్పుడు ప్రమోషన్స్ లో వాపోతూ ఉంటాడు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మరోసారి ట్రోలింగ్స్ బారిన పడ్డాడు కిరణ్ అబ్బవరం.

అందుకు గల కారణం తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోనే.మొన్నటి వరకు సినిమాలతో ప్రమోషన్లతో బిజీబిజీగా గడిపిన కిరణ్ ఇప్పుడు ఎంచక్కా ఇంటిపట్టునే ఉంటూ హాయిగా రిలాక్స్ అవుతూ సెటిల్ ఆడుతూ ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

షటిల్ ఆడుతున్నట్టుగా ఉన్న ఫోజ్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో ఆ ఫోటో పై నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్( Negative Comments ) చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.కొందరు హీరోలా ఉన్నావు అంటూ సెటైర్లు వేస్తూ పరువు తీసేస్తున్నారు.ఇంకొందరు హీరోని పట్టుకుని హీరోలా ఉన్నావు అంటారేంటి రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి హీరో కిరణ్ అబ్బవరం మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ ని ఎదుర్కొంటున్నారు.

ఇకపోతే కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే.కిరణ్ తాజాగా నటించిన చిత్రం రూల్స్ రంజన్( Rules Ranjan ).

ఇందులో నేహా శెట్టి హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube